Leading News Portal in Telugu

Ganesh Arrest in Karnataka: హృదయవిదారక చిత్రం.. వినాయకుడిని వ్యాన్‌లో బంధించిన పోలీసులు


  • కర్ణాటకలో వినాయకుడికి ఘోర అవమానం
  • విగ్రహాన్ని వ్యాన్ లో బంధించిన పోలీసుల
  • మండిపడుతున్న హిందువులు
  • అసలు ఏం జరిగిందంటే..?
Ganesh Arrest in Karnataka: హృదయవిదారక చిత్రం.. వినాయకుడిని వ్యాన్‌లో బంధించిన పోలీసులు

స్వాతంత్ర్యోద్యమంలో కులమతాలకు అతీతంగా అందరినీ ఒక్కటి చేసిన వినాయకుడికి కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఘోర అవమానం జరిగింది. భారతీయులను బానిసల్లాగా మార్చి దాదాపు రెండు వందల ఏళ్లు పాలించిన బ్రిటీషర్స్ ని దేశం నుంచి తరమాలని పూనుకున్న బాలగంగాధర్ తిలక్.. కులమతాలకు అతీతంగా అందరినీ ఏకం చేసేందుకు వినాయక ఉత్సవాలను ప్రారంభించారు. కానీ.. నేడు ఆయన కృషి నీరుగారింది. అప్పుడు ప్రారంభమైన ఉత్సవాలు నేడు దేశవ్యాప్తంగా విస్తరించాయి. విదేశాల్లో సైతం బొజ్జ గణపయ్యను పూజిస్తున్నారు. కానీ.. కర్ణాటకలో మాత్రం హృదయవిదారకర ఘటన చోటు చేసుకుంది. ఇన్ని రోజులు నిష్ఠగా పూజలు అందుకున్న విఘ్నేషుడు నిందితుడిలా మారాడు. పోలీసులు నిందితులు, దొంగలను బంధించి తీసుకెళ్లే వ్యాన్ లో గణపయ్యను ఉంచారు. హిందువుల ఆరాధ్య ధైవం, తొలి పూజలందుకుంటున్న లంబోదరుడు పోలీస్ వ్యాన్ లో నిస్సాయక స్థితిలో కనిపించడం కలచివేసింది. అసలు ఏం జరిగిందంటే..

READ MORE: Deepjyoti: ప్రధాని నివాసంలో కొత్త సభ్యుడు.. “దీప్‌జ్యోతి”తో మోడీ ఫోటోలు

కర్ణాటకలోని మాండ్యా జిల్లా నాగమంగళ పట్టణంలో 2024 సెప్టెంబర్ 11న గణపతి నిమజ్జనం సందర్భంగా రాళ్లదాడి జరిగింది. వినాయక నిమజ్జన ఊరేగింపు జరుగుతుండగా.. ఓ వర్గానికి చెందిన యువకులు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో పోలీసు ఇన్‌స్పెక్టర్ సస్పెండ్ అయ్యారు. ఈ కేసులో పోలీసులు శుక్రవారం (13 సెప్టెంబర్ 2024)న పది ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశారు. ఇప్పటి వరకు ఈ ఘటనలో ప్రమేయమున్న 56 మంది నిందితులను అరెస్టు చేయగా, మరో 90 మంది కోసం గాలిస్తున్నారు. అదే సమయంలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు.

READ MORE: Haryana: అండర్‌పాస్‌ బ్రిడ్జి కింద నీటిలో కారు.. ఇద్దరు ఉద్యోగులు మృతి

కాగా.. మండ్యలోని నాగమంగళలో జరిగిన అల్లర్లను ఖండిస్తూ హిందూ సంఘాలు రాజధాని బెంగళూరులో నిరసన వ్యక్తం చేశాయి. ఈ నిరసనలో వినాయకుడి విగ్రహాన్ని ప్రదర్శించారు. ఆందోళన ఉద్ధృతం కావడంతో పోలీసులు నిరసన కారులను అరెస్ట్ చేసేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలో విఘ్నేషుడిని పోలీసులు నిరసన కారుల నుంచి లాక్కున్నారు. నిందితులను అరెస్ట్ చేసి తీసుకెళ్లే పోలీస్ వ్యాన్ లో బొజ్జ వినాయకుడిని ఉంచారు. ఈ ఫొటో చూసిన హిందూ సమాజం.. తీవ్రంగా మండిపడుతుంది. ఈ ఫొటోలను ఎక్స్ లో పలువురు పోస్ట్ చేయగా.. ఓ వినియోగదారుడు ఇలా కామెంట్ చేశాడు.. “తొలి నుంచే హిందువులు అంటే కాంగ్రెస్ కు ఇష్టం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇలాంటి ఘటనలు చూసి ఆశ్చర్యం చెందాల్సిన అవసరం లేదు.” అని రాసుకొచ్చాడు.

READ MORE: Fire Accident: విశాఖ కంటైనర్ టెర్మినల్‌లో అగ్ని ప్రమాదం

ఇదిలా ఉండగా.. మండ్య.. అల్లర్ల సమయంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ను శుక్రవారం (సెప్టెంబర్ 13) సస్పెండ్ చేశారు. గతేడాది గణేష్ చతుర్థి సందర్భంగా జరిగిన అల్లర్లపై పోలీసు ఇన్‌స్పెక్టర్ అశోక్ కుమార్ ఉన్నతాధికారులకు సమాచారం అందించలేదు. ఈసారి కూడా అశోక్ కుమార్ తగిన భద్రతా ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారు.