Leading News Portal in Telugu

Hyderabad: గచ్చిబౌలి రెడ్స్టోన్ హోటల్లో నర్సింగ్ విద్యార్థిని దారుణ హత్య..


  • గచ్చిబౌలి రెడ్ స్టోన్ హోటల్ లో నర్సింగ్ విద్యార్థిని దారుణ హత్య..

  • అత్యాచారం చేసి హత్య చేశారని బంధువుల ఆరోపణ..

  • ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు..
Hyderabad: గచ్చిబౌలి రెడ్స్టోన్ హోటల్లో నర్సింగ్ విద్యార్థిని దారుణ హత్య..

Hyderabad: హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో గల రెడ్ స్టోన్ హోటల్ లో దారుణం చోటు చేసుకుంది. నర్సింగ్ స్టూడెంట్ అనుమానాస్పద మృతికి గురైంది. రేప్ అండ్ మర్డర్ చేసి ఆత్యహత్యగా చిత్రీకరిస్తున్నారనీ మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి రెడ్ స్టోన్ హోటల్ లో ఇద్దరు అమ్మాయిలు రెండు గదులు తీసుకున్నారు. ఇవాళ (సోమవారం) ఉదయం ఓ గదిలో శృతి అనే నర్సింగ్ స్టూడెంట్ చనిపోయింది.

అయితే, పోలీసులు శృతి మృతదేహాన్ని అంబులెన్స్ లోకి ఎక్కిస్తుండగా మృతురాలి బంధువులు అడ్డుకున్నారు. ఆ డెడ్ బాడీతో రెడ్ స్టోన్ హోటల్ ముందు ఆందోళనకు దిగారు. శృతిని రేప్ చేసి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. రూమ్ లో భారీగా మద్యం బాటిళ్లు లభించాయని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి.. సమగ్ర దర్యాప్తుచేస్తామని పేర్కొన్నారు.