Leading News Portal in Telugu

MP Mithun Reddy: ఎంపీ మిథున్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. నేనే ఎమ్మెల్యేగా పోటీచేస్తా..!


  • ఎంపీ మిథున్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..

  • జనగణన అయిన తర్వాతే నియోజకవర్గాల విభజన..

  • ఒకవేళ పుంగనూరును రెండు నియోజకవర్గాలుగా చేస్తే..

  • ఒక నియోజకవర్గం నుండి నేనే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటన..
MP Mithun Reddy: ఎంపీ మిథున్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. నేనే ఎమ్మెల్యేగా పోటీచేస్తా..!

MP Mithun Reddy: తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి.. చిత్తూరు జిల్లా పుంగనూరులో పర్యటించారు ఎంపీ మిథున్‌ రెడ్డి.. అయితే టీడీపీ శ్రేణులు అడ్డుకుంటారని భారీగా మోహరించారు పోలీసులు.. మున్సిపల్ కార్యాలయంలో వైసీపీ నాయకులతో సమావేశం నిర్వహించారు.. అయితే, కౌన్సిలర్లు తప్ప ఎవరికి అనుమతి లేదని గేట్ ముందు వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్నరు పోలీసులు.. ఇక, ఈ సందర్భంగా మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గాల విభజన అనేది ఇప్పట్లో లేదని స్పష్టం చేశారు..

కేంద్రం మహిళ రిజర్వేషన్ బిల్లు తీసుకోచ్చింది.. జనగణన ఇంకా అవ్వలేదు.. జనగణన అయిన తర్వాతే నియోజకవర్గాల విభజన జరుగుతుందన్నారు ఎంపీ మిథున్‌రెడ్డి.. అయితే, ఒకవేళ పుంగనూరును రెండు నియోజకవర్గాలుగా చేస్తే ఒక నియోజకవర్గం నుండి నేనే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. పుంగనూరు అభివృద్ధి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.. పుంగనూరు నియోజకవర్గం మా తల్లి లాంటిది.. ఆ ప్రేమతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం అన్నారు. మరోవైపు.. వక్ఫ్ బోర్డ్ బిల్లు మైనారిటీలకు వ్యతిరేకంగా ఉంది.. ఈ విషయంలో ముస్లింలకు అండగా వైసీపీ నిలబడుతుంది.. వక్ఫ్ బోర్డ్ బిల్లును మేం వ్యతిరేకించాం‌.. మళ్లీ పార్లమెంటులో ముస్లింలకు వ్యతిరేకంగా ఉంటే దానికి మేం మద్దతు ఇవ్వబోమని మరోసారి క్లారిటీ ఇచ్చారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి..