Leading News Portal in Telugu

Hyderabad Youth Died: కెనడాలో హైదరాబాద్ యువకుడు దుర్మరణం..


  • కెనడాలో హైదరాబాద్ యువకుడు దుర్మరణం

  • ఉన్నత చదవుల కోసం వెళ్లిన ప్రణీత్ అనే యువకుడు

  • చెరువులో ఈతకు వెళ్లి మృతి

  • మీర్ పేట్ కి చెందిన రవి
  • సునీతల కుమారుడు.
Hyderabad Youth Died: కెనడాలో హైదరాబాద్ యువకుడు దుర్మరణం..

కెనడాలో హైదరాబాద్ నగరంలోని మీర్‌పేట్‌కు చెందిన యువకుడు మృతి చెందాడు. ప్రణీత్ అనే యువకుడు కెనడాలో ఎం.ఎస్ (Master of Science) చేయడానికి అని వెళ్లాడు. అయితే.. అక్కడ చెరువులో ఈతకు వెళ్లి చనిపోయాడు. కాగా.. మీర్‌పేట్ కి చెందిన రవి, సునీతకి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారులో కెనడాలోనే చదువుకుంటుననారు. ఉన్నత చదువుల కోసం 2019లో అక్కడికి వెళ్లారు.

నిన్న (ఆదివారం) చిన్న కుమారుడు ప్రణీత్ పుట్టిన రోజు కావడంతో స్నేహితులతో కలిసి టొరంటో లోని లేక్ క్లియర్‌కి ఔటింగ్‌కి వెళ్లారు. ఈ క్రమంలో.. ఈత కొడుతూ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగి పోయారు. పుట్టిన రోజే మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా.. తమ కుమారుడి మృతదేహాన్ని త్వరగా ఇండియాకి చేరడానికి ప్రభుత్వం సహకరించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.