Leading News Portal in Telugu

Khairatabad Ganesh: గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణనాథుడు..


  • ఖైరతాబాద్‌లో భారీ గణనాథుని నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది..

  • మధ్యాహ్నం 1.39 గంటలకు నిమజ్జనం పూర్తయింది..
Khairatabad Ganesh: గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణనాథుడు..

Khairatabad Ganesh: ఖైరతాబాద్‌లో భారీ గణనాథుని నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 1.39 గంటలకు ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం పూర్తయింది. 4వ క్రేన్ దగ్గర 70 అడుగుల ఖైరతాబాద్ బొజ్జ గణపయ్య నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. దీంతో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన క్రతువు వైభవంగా సాగింది. 70 అడుగుల భారీ మహా గణనాథుని విగ్రహాన్ని వేలాది మంది భక్తుల మధ్య డప్పుల మోత, డీజేల కోలాహలమైన సంగీతం మధ్య ట్యాంక్‌బండ్‌కు ఊరేగింపుగా తీసుకెళ్లారు. శోభాయాత్రను తిలకించేందుకు వేలాది మంది భక్తులు రోడ్లపైకి రావడంతో ఖైరతాబాద్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మహా గణపతిని చూసేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.


IAS Rani Kumudini: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ రాణి కుముదిని..