Leading News Portal in Telugu

Jr NTR: డైరెక్టర్ గారూ.. నాతో డైరెక్ట్ తెలుగు సినిమా చేయండి.. ఎన్టీఆర్ అభ్యర్ధన!!


Jr NTR: డైరెక్టర్ గారూ.. నాతో డైరెక్ట్ తెలుగు సినిమా చేయండి.. ఎన్టీఆర్ అభ్యర్ధన!!

Jr NTR Looks To Collaborate With Tamil Filmmaker Vetrimaaran: తమిళనాడు రాష్ట్రంలో దేవర సినిమాను ప్రమోట్ చేసేందుకు వెళ్లిన ఎన్టీఆర్ అక్కడ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు చెన్నైలో ప్రెస్ మీట్ నిర్వహించారు దేవర మేకర్స్. ఈ సందర్భంగా ఒక మీడియా ప్రతినిధి ఎప్పుడు తమిళ డైరెక్ట్ సినిమా చేస్తున్నారు అని అడిగితే దానికి ఎన్టీఆర్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. డైరెక్టర్ వెట్రిమారన్ త్వరగా తనతో ఒక తమిళ సినిమా చేయాలని దాన్ని తెలుగులో డబ్బింగ్ చేస్తామని ఈ సందర్భంగా ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. నిజానికి వెట్రిమారన్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కే అవకాశం ఉందని, చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా పట్టాలెక్కడానికి ఇంకా టైం ఉంది అనే ప్రచారం కూడా ఉంది.

Singer Mano Sons: మనో కూమారులు దాడి వెనుక కుట్ర.. బయటకు షాకింగ్ వీడియోలు

ఇలాంటి తరుణంలో వెట్రిమారన్ తనతో ఒక తమిళ డైరెక్ట్ సినిమా చేయాలని ఎన్టీఆర్ కోరడం హాట్ టాపిక్ అవుతోంది. ఇక ఆడు కాలం సినిమాతో వెట్రిమారన్ దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. తర్వాత వడచెన్నై, అసురన్, విడుతలై సినిమాలతో ఆయన మరింత పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతానికి ఆయన దర్శకత్వంలో విడుతలై సెకండ్ పార్ట్ తెరకేక్కుతోంది. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది, ఇక దేవర విషయానికి వస్తే ఈ సినిమాని కొరటాల శివ డైరెక్టర్ దేవర మొదటి భాగం సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా ప్యాన్ ఇండియా లెవెల్ లో చేస్తున్నారు మేకర్లు.