Leading News Portal in Telugu

Jani Master: ఆ అమ్మాయి కళ్ళు చూసి ఇష్టపడ్డా.. వైరల్ అవుతున్న జానీ మాస్టర్ పాత వీడియో


Jani Master: ఆ అమ్మాయి కళ్ళు చూసి ఇష్టపడ్డా.. వైరల్ అవుతున్న జానీ మాస్టర్ పాత వీడియో

Jani Master Old Video goes Viral amid Rape Case: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద రేప్ కేసు సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ సందర్భంగా ఆ అమ్మాయి కళ్ళు చూసి ఇష్టపడ్డాను అంటూ జానీ మాస్టర్ మాట్లాడుతున్న ఒక పాత వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. అసలు విషయం ఏమిటంటే ఒక లేడీ కొరియోగ్రాఫర్ తనను జానీ మాస్టర్ లైంగికంగా వేధించాడని, పలుసార్లు రేప్ చేశాడని చెబుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2019లో జానీ మాస్టర్ దగ్గర తాను అసిస్టెంట్గా జాయిన్ అయ్యానని అప్పటినుంచి తనను బలవంతం చేసేవాడని మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని కూడా పలుసార్లు బెదిరించాడని అంటూ ఆమె ఆరోపణలు గుప్పించింది.

Poonam Kaur: త్రివిక్రమ్ మీద కంప్లైంట్ తీసుకోలేదు.. మరోసారి గురూజీపై పూనమ్ సంచలనం

అయితే అదే అమ్మాయికి వర్తించే విధంగా జానీ మాస్టర్ చెబుతున్నా పాత వీడియో వైరల్ అవుతుంది. ఆ అమ్మాయి కళ్ళు చూసి ఇష్టపడ్డాను, ఐశ్వర్య కళ్ళ లాగా ఉంటాయి. ఆ అమ్మాయి చాలా బాగుంటుంది, బాగుంది అని అప్పుడు కొంచెం కనెక్ట్ అయ్యాను. డైరెక్ట్ ఆమె దగ్గరికి వెళ్ళిపోయి మీరేం చేస్తారు అంటే నేను క్లాసికల్ ప్రోగ్రామ్స్ చేసుకుంటాను డాన్సర్ని అని చెప్పింది. నా దగ్గర అసిస్టెంట్ గా చేస్తారా అని అడిగాను లేదు నేను చేయనని చెప్పి వెళ్ళిపోయింది. నేను మాట్లాడదామని వెళ్ళినప్పుడు మిస్సయింది తర్వాత యూనియన్ లో కనబడింది. ఎవరు ఈ అమ్మాయి, ఎక్కడో చూసినట్టుంది అని గుర్తు తెచ్చుకుంటే అప్పుడు చూసిన అమ్మాయి అని గుర్తు వచ్చింది. అప్పుడు మాట్లాడడానికి ట్రై చేశాను అంటూ జానీ మాస్టర్ చెబుతున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.