Leading News Portal in Telugu

Andhra Pradesh: ఇవాళ ఎన్డీఏ శాసన సభా పక్ష సమావేశం.. ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం


Andhra Pradesh: ఇవాళ ఎన్డీఏ శాసన సభా పక్ష సమావేశం.. ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం

Andhra Pradesh: ఇవాళ ఏపీలో ఎన్డీఏ శాసన సభా పక్ష సమావేశం జరగనుంది. మధ్యాహ్నం జరగనున్న ఎన్డీయే పక్ష సమావేశానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురంధేశ్వరి హాజరుకానున్నారు. 100 రోజుల పాలన, ఎమ్మెల్యేల పని తీరుపై ఎన్డీయే శాసన సభా పక్ష సమావేశంలో చర్చించనున్నారు. భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యేలకు ఏపీ ఎన్డీయే అగ్ర నాయకత్వం దిశా నిర్దేశం చేయనుంది. మరికొన్ని కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.