Leading News Portal in Telugu

Tension in Narayanapet: నారాయణపేటలో ఉద్రిక్తత.. ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ హెచ్చరిక..


  • నారాయణ పేట జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు..

  • ఇరు వర్గాల మధ్య దాదాపు మూడు గంటల పాటు ఉద్రిక్తత వాతావరణం..

  • ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ హెచ్చరిక..
Tension in Narayanapet: నారాయణపేటలో ఉద్రిక్తత.. ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ హెచ్చరిక..

Tension in Narayanapet: నారాయణ పేట జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దాదాపు మూడు గంటల పాటు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. దీంతో తప్పని పరిస్థితుల్లో పోలీస్ ల లాఠీ ఛార్జ్ చేశారు. నేడు పట్టణంలో మిలాద్ ఉన్ నబీ ర్యాలీ దృష్యా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ హెచ్చరించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో జెండావివాదం ఘటనాస్థలం.. గురువారం జిల్లా కేంద్రంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. మరోవైపు జెండా వివాదం కారణంగా ఇరువర్గాల మధ్య రాళ్లు రువ్విన సంగతి తెలిసిందే. ఎస్పీ కార్యాలయం నుంచి జిల్లా కేంద్రం వరకు ప్రధాన రహదారి గుండా బలగాలను మోహరించారు. మల్టీ జోన్ -2 ఐజీ సత్యనారాయణ, జోగులాంబ జోన్ డీఐజీ ఎల్ ఎస్ చౌహాన్ జిల్లా కేంద్రంలోని పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లా కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ముఖ్యంగా యువత సంయమనం పాటించాలని, అనవసర తగాదాలకు పాల్పడితే చట్ట ప్రకారం శిక్షిస్తామన్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలోని సీసీ కెమెరాల ద్వారా జెండా వివాదంతో అల్లర్లకు దారితీసిన వ్యక్తులను గుర్తించామన్నారు.
Hyderabad Metro: మెట్రో ఎక్స్ అకౌంట్ హ్యాక్.. యాజమాన్యం కీలక సూచన..