Leading News Portal in Telugu

CM Relief Fund: సీఎం రిలీఫ్ ఫండ్కు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం..


  • వరద సాయం కింద సీఎం రిలీఫ్ ఫండ్ కు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం

  • రూ. 25 కోట్లను చెక్కును సీఎం చంద్రబాబుకు అందించిన అదానీ పోర్ట్స్.. సెజ్ ఎండీ కరణ్ అదానీ

  • అదానీ గ్రూప్స్ యాజనాన్యానికి ధవ్యవాదాలు తెలిపిన సీఎం చంద్రబాబు.
CM Relief Fund: సీఎం రిలీఫ్ ఫండ్కు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం..

ఓవైపు భారీ వర్షాలు.. మరోవైపు కృష్ణానదిలో వరద. ఇంకో వైపు బుడమేరు కాలువకు గండ్లు పడడంతో విజయవాడ అతలాకుతలం అయ్యింది. ఇక, రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో తీరని నష్టాన్ని మిగిల్చాయి వరదలు. అయితే.. వరద బాధితులకు విరాళాలు ఇవ్వడానికి ప‌లువురు దాత‌లు ముందుకొస్తున్నారు. కూటమి ప్రభుత్వం.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుతో స్పందించిత‌న దాత‌లు, ప్రముఖులు, పారిశ్రామిక, వ్యాపార‌, విద్యా, వాణిజ్య సంస్థల‌కు చెందిన వారు సీఎం చంద్రబాబు నాయుడుని కలిసి విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు విరాళాలు అందించారు.

తాజాగా.. వరద సాయం కింద సీఎం రిలీఫ్ ఫండ్కు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం ఇచ్చింది. రూ. 25 కోట్లను చెక్కును సీఎం చంద్రబాబుకు అదానీ పోర్ట్స్, సెజ్ ఎండీ కరణ్ అదానీ అందించారు. వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన ఏపీని ఆదుకునేందుకు తమ వంతు సహకారం అందిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా.. అదానీ గ్రూప్స్ యాజనాన్యానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. రూ. 25 కోట్ల విరాళానికి సంబంధించిన పత్రాలను సంస్థ ఎండీ కరణ్ అదానీ అందిస్తున్న ఫోటోను సీఎం చంద్రబాబు ఎక్స్‌లో షేర్ చేశారు.