- వైసీపీకి మరో షాక్
- మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీకి రాజీనామా
- వైసీపీ అధినేత వైఎస్ జగన్కు రాజీనామా లేఖ

Samineni Udayabhanu: వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను వైసీపీ అధినేత వైఎస్ జగన్కు ఉదయభాను పంపారు. తాను వైసీపీ ఆవిర్భావం నుంచి ఉన్నానని.. వైఎస్సార్, జగన్కు ముఖ్య అనుచరుడిగా కలిసి నడిచినట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
వైఎస్ఆర్ మరణం తనలాంటి వాళ్లను చీకట్లోకి నెట్టేసిందన్నారు. వైఎస్ఆర్ ఆశయాలను మీరు కొనసాగిస్తారని నమ్మి మీతో(జగన్) నడిచాననని.. కానీ ప్రతిసారి అన్యాయమే జరిగిందని ఉదయభాను లేఖలో తెలిపారు. వైఎస్ఆర్పై అభిమానంతో అన్ని భరించానన్నారు. చివరికి పార్టీలో తనకు సరైన గుర్తింపు దక్కలేదని.. అవన్నీ తన మనసును కలిచివేశాయన్నారు. ఆత్మాభిమానం కాపాడుకోవడం కోసం పార్టీకి రాజీనామా చేస్తున్నానని సామినేని ఉదయభాను పేర్కొన్నారు.