Leading News Portal in Telugu

UP: బర్త్‌డే పార్టీకి తీసుకెళ్లి.. విద్యార్థినిపై సామూహిక అత్యాచారం


  • యూపీలోని మహోబాలో ఓ సంచలన కేసు

  • బర్త్‌డే పార్టీ పేరుతో ఇద్దరు స్నేహితులు ఎల్‌ఎల్‌బీ విద్యార్థినిని అత్యాచారం

  • అత్యాచార వీడియోను సోషల్ మీడియాలో పెడుతామని బెదిరింపులు

  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలి తండ్రి.
UP: బర్త్‌డే పార్టీకి తీసుకెళ్లి.. విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

యూపీలోని మహోబాలో ఓ సంచలన కేసు వెలుగు చూసింది. బర్త్‌డే పార్టీ పేరుతో ఇద్దరు స్నేహితులు ఎల్‌ఎల్‌బీ విద్యార్థినిని హోటల్‌కు తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెడుతామని బెదిరించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితులిద్దరిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.

సెప్టెంబరు 4న తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటానని చెప్పి తన కుమార్తె, స్నేహితుడు ఆదిత్య సింగ్ లా కాలేజీ నుంచి తీసుకెళ్లాడని బాధితురాలి తండ్రి పోలీసులకు తెలిపాడు. చరఖారీ బైపాస్‌లో ఉన్న ఓ హోటల్‌కి తీసుకెళ్లగా.. అక్కడికి ఆదిత్య స్నేహితుడు సమీర్ కూడా వచ్చాడు. ఆ తర్వాత ఆదిత్య, సమీర్‌లు తన కూతురిని బెదిరించి అత్యాచారం చేసి అభ్యంతరకరంగా వీడియో తీశారని పోలీసులకు చెప్పాడు. బాధితురాలు స్పృహలోకి రాగానే ఇద్దరూ తన కూతురిని కాలేజీలో వదిలి వెళ్లిపోయారని అన్నాడు. ఈ విషయం గురించి ఎవరికైనా చెప్తే వీడియో వైరల్ చేస్తానని బెదిరించారని బాధితురాలి తండ్రి పోలీసులకు తెలిపాడు.

తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన జరిగిన తర్వాత తన కుమార్తె కళాశాలకు వెళ్లడం మానేసి ఇంట్లోనే ఉంటుందని అన్నాడు. ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించగా తన బాధను చెప్పిందని.. నిందితులు పంపిన వీడియోను కూడా చూపించిందని తండ్రి చెప్పాడు. ఈ క్రమంలో.. పోలీసులు నిందితులు ఆదిత్య, సమీర్‌లపై ఎస్సీ-ఎస్టీ చట్టం కింద అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.