Leading News Portal in Telugu

Gun Firing: బార్ వెలుపల కాల్పులు.. నలుగురు మృతి.. పలువురికి గాయాలు..


  • అమెరికాలోని అలబామా రాష్ట్రంలో శనివారం అర్థరాత్రి బార్ వెలుపల కాల్పలు.
  • నలుగురు మృతి..
  • పలువురికి గాయాలు..
Gun Firing: బార్ వెలుపల కాల్పులు.. నలుగురు మృతి.. పలువురికి గాయాలు..

Gun Firing: అమెరికాలోని అలబామా రాష్ట్రంలో శనివారం అర్థరాత్రి బార్ వెలుపల జరిగిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మరణించారు. ఇంకా అనేకమంది గాయపడ్డారు. ఈ ఘటన ఆ ప్రాంతమంతా కలకలం రేపింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స కొనసాగిస్తున్నారు. అనేక మంది దాడి చేసిన వ్యక్తులు ఈ సంఘటనకు పాల్పడ్డారని అమెరికా అధికారులు భావిస్తున్నారు. అయితే, నిందితుల్లో ఎవరినీ ఇంకా అరెస్టు చేయలేదు. విచారణ కొనసాగుతోంది.

IND vs BAN: బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు భారత జట్టు ప్రకటన..

బర్మింగ్‌హామ్‌ లోని ఫైవ్ పాయింట్స్ సౌత్ ప్రాంతంలోని బార్ వెలుపల అనేక మంది దుండగులు కాల్పులు జరిపి గందరగోళ వాతావరణాన్ని సృష్టించారు. ఈ కాల్పుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, నాలుగో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అందిన సమాచారం ప్రకారం.. రాత్రి 11 గంటల సమయంలో కాల్పుల ఘటనపై పోలీసులకు సమాచారం అందింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కాల్పుల్లో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

Ravichandran Ashwin: దిగ్గజాల రికార్డులు బ్రేక్స్ చేసిన అశ్విన్‌!

బర్మింగ్‌హామ్ ఫైర్ అండ్ రెస్క్యూ 8 మంది బాధితులను ఆసుపత్రికి తరలించినట్లు నివేదించింది. వీరిలో 4 మందికి ప్రాణాపాయ గాయాలయ్యాయి. పదుల సంఖ్యలో బాధితులు నగరంలోని పలు ఆసుపత్రుల్లో చేరినట్లు అధికారులు తెలిపారు. మాగ్నోలియా అవెన్యూ వద్ద కాలిబాటపై లేదా వీధిలో వ్యక్తుల సమూహంపై పలువురు షూటర్లు కాల్పులు జరిపారని పోలీసులు అంటున్నారు. దాడికి పాల్పడిన వారు కాలినడకన వచ్చారా లేక కారులో వచ్చారా అనే విషయంపై ఇప్పుడు ఆరా తీస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.