Leading News Portal in Telugu

Devi Sri Prasad: అమెరికా ప్ర‌ధాని మోడీ సభ‌లో ఊర్రూత‌లూగించిన డీఎస్‭పి..


  • ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన.
  • ‘మోదీ అండ్ యూఎస్ ప్రోగ్రెస్ టుగెద‌ర్’ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భారతీయులు హాజరు.
  • సభ‌లో ఊర్రూత‌లూగించిన డీఎస్‭పి.
Devi Sri Prasad: అమెరికా ప్ర‌ధాని మోడీ సభ‌లో ఊర్రూత‌లూగించిన డీఎస్‭పి..

Devi Sri Prasad – Pm MODI: ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం న్యూజెర్సీలోని ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోడీకి ఎన్నారైల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. ఇండో-అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యూఎస్ఏ నిర్వహించిన ‘మోదీ అండ్ యూఎస్ ప్రోగ్రెస్ టుగెద‌ర్’ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భారతీయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అక్కడివారిని బాగా అలరించాయి. ముఖ్యంగా సంగీత దర్శకుడు, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ పుష్ప చిత్రంలోని ‘శ్రీవల్లి’ పాటను పాడి అక్కడి వారిని ఆకట్టుకున్నారు. ఆ తర్వాత డీఎస్‭పి ‘హర్ ఘర్ తిరంగ’ పాటను ఆలపిస్తుండగా.. పీఎం మోడీ వేదికపైకి వచ్చారు. దాంతో ఒక్క‌సారిగా ఆ ఆడిటోరియం మొత్తం క‌ర‌తాళ ధ్వ‌నులతో మిన్నంటాయి.

Miss Universe India 2024: గుజరాత్‌ యువతిదే ‘మిస్ యూనివర్స్ ఇండియా’ కిరీటం!

‘నమస్తే ఇండియా’ అంటూ ప్రవాసాంధ్రులకు స్వాగతం పలికిన డీఎస్పీ.. ప్రధాని సమక్షంలోనే తన పాటను కొనసాగించారు. అనంతరం దేవిశ్రీతో పాటు గుజరాతీ గాయకుడు ఆదిత్య గాధ్వి, ఇతర కళాకారులను మోదీ అభినందించారు. కొద్దిసేపటికే పెద్దఎత్తున కార్యక్రమానికి వచ్చిన ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రస్తుతం డీఎస్‭పి, ప్రధాని మోడీ సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.