Leading News Portal in Telugu

Heavy Rains in AP: బంగాళాఖాతంలో అల్పపీడనం..! ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..


  • నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..!

  • పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం..

  • వచ్చే మూడు రోజుల పాటు పలు జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన..
Heavy Rains in AP: బంగాళాఖాతంలో అల్పపీడనం..! ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

Heavy Rains in AP: ఓవైపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచికొడుతూనే ఉన్నాయి.. తెలంగాణలో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది.. పగలంతా ఎండలు.. ఉక్కపోత ఉంటే.. సాయంత్రం నుంచి తెల్లవారాజాము వరకు కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది.. ఏపీలోని పలు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.. కాగా.. నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉంది.. దీని ప్రభావంతో.. వచ్చే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన ఉందంటోంది వాతావరణ శాఖ..

ఇక, ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్త నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వాతావరణశాఖ అధికారులు.. మరోవైపు.. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతోంది అమరావతి వాతావరణ కేంద్రం.. ఇక, ఇన్న విజయనగరం, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, శ్రీసత్యసాయి, ప్రకాశం, పార్వతీపురం మన్యం, చిత్తూరు సహా పలు జిల్లాల్లో వర్షం కురిసింది.. అత్యధికంగా విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో 79.25 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది.