Leading News Portal in Telugu

Farmer Robot: రోబోట్ రైతులా మారితే ఇట్లే ఉంటుంది కాబోలు..(వీడియో)


  • ప్రస్తుత ఆధునిక యుగంలో రోజుకొక కొత్త టెక్నాలజీ.
  • ఈ టెక్నాలజీ యుగంలో ఎక్కువగా కృతిమ మేధస్సు సంబంధించిన పరిశోధనలు.
  • సోషల్ మీడియాలో వైరల్.
  • రైతులా మారిన రోబోట్..
Farmer Robot: రోబోట్ రైతులా మారితే ఇట్లే ఉంటుంది కాబోలు..(వీడియో)

Farmer Robot: ప్రస్తుత ఆధునిక యుగంలో రోజుకొక కొత్త టెక్నాలజీ రావడం చూస్తూనే ఉన్నాము. ఈ టెక్నాలజీ యుగంలో ఎక్కువగా కృతిమ మేధస్సు (Artificial intelligence) సంబంధించిన అనేక పరిశోధనలు, వాటికి సంబంధించిన ఉత్పత్తులు మార్కెట్లో కనిపిస్తున్నాయి. కృత్రిమ మేధస్సు మంచి అవసరాలకు, అలాగే కొందరు ఆ టెక్నాలజీని వాడుకొని చేయరాని పనులు కూడా చేయరాని పనులు కూడా చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రోబో సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో రోబో అచ్చం రైతుల మారిపోతే ఎలా ఉంటుందన్న విషయం అర్థమవుతుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..

Western Railway TC: మహారాష్ట్రీయులు లేదా ముస్లిం వ్యాపారాలకు మద్దతు ఇవ్వను..

ఈరోజుల్లో అన్ని రంగాల్లో మనుషులను మించిపోయేలా రోబోలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు వ్యవసాయ రంగంలోకి కూడా రోబోలు ప్రవేశించాయి. పొలంలో రైతులా పని చేస్తున్న రోబో వీడియో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన వీడియోలో, అచ్చం రైతులాగ రోబోట్ పొలంలో పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది. వీడియోలో, ఈ రోబోట్ పొలంలో నాటడం, పంటలకు నీరు పెట్టడం, పంటలు కోయడం వంటి ఒక రైతు చేయగలిగిన ప్రతిదాన్ని చేస్తోంది. InterestingSTEM అనే ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియో షేర్ చేయబడింది. ఈ వీడియో షేర్ చేసిన గంటల్లోనే లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. అలాగే పలువురు నెటిజన్లు కూడా రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో చూస్తే కచ్చితంగా ఇది తయారు చేసిన వీడియో అని ఇట్టే గుర్తు పట్టవచ్చు.