Leading News Portal in Telugu

Jani Master Case : జానీ మాస్టర్‌ కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్‌


Jani Master Case : జానీ మాస్టర్‌ కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్‌

జానీ మాస్టర్‌ కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్‌ వేశారు. జానీ మాస్టర్‌ను కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్‌ దాఖలు చేశారు నార్సింగి పోలీసులు. జానీ మాస్టర్‌ను విచారించి మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సిఉందన్న పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ కేసులో జానీ మాస్టర్‌ను ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు కస్టడీ పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే.. లైంగిక వేధింపులు, పోక్సో్ కేసు నమోదైన నేపథ్యంలో జానీ మాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. గోవాలో ఉన్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. గోవాలోని ఓ లాడ్జీలో మాస్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Minister Anam Ramanarayana Reddy: ప్రపంచవ్యాప్తంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి..

అనంతరం అక్కడి కోర్టులో హాజరుపరిచి.. హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్‌ను హాజరుపరిచారు. దీంతో కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం జానీ మాస్టర్‌ హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన్ను వారం రోజుల పాటు కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు సోమవారం ఉప్పరపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే జానీపై పోక్సో కేసు(POCSO case) నమోదు కావడంతో రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టుకు ఈ పిటిషన్‌ను బదిలీ చేశారు. ఇవాళే ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా బెయిల్ కోసం జానీ మాస్టర్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Snake bite: పాముకాటుతో యువకుడు మృతి.. అతని చితిపై పామును సజీవ దహనం