Leading News Portal in Telugu

Kiladi Kurrollu: ‘కిలాడీ కుర్రోళ్ళు’ అంటూ వస్తున్న మరో కమెడియన్ కొడుకు


Kiladi Kurrollu: ‘కిలాడీ కుర్రోళ్ళు’ అంటూ వస్తున్న మరో కమెడియన్ కొడుకు

Comedian Gautam Raju’s son Krishna Coming With Kiladi Kurrollu : టాలీవుడ్లో వారసుల ఎంట్రీ అనేది కొత్త ఏమీ కాదు. అలా చాలా మంది తమ తల్లిదండ్రుల వారసత్వం అందుకుని సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. సీనియర్ కమెడియన్ గౌతమ్ రాజు తనయుడు కొత్త కథతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు.గౌతం రాజు తనయుడు కృష్ణ హీరోగా కరోనా టైంలో ఓటీటీలో సందడి చేశాడు. కృష్ణారావు సూపర్ మార్కెట్ అంటూ మొదటి చిత్రంతోనే మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు కృష్ణ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారని అంటున్నారు. అయితే అందులో ముందుగా త్వరలోనే అతడు ‘కిలాడీ కుర్రోళ్ళు’ అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు.

Parvati Nair : పనిమనిషి తెచ్చిన తంటా.. నటిపై కేసు

ఈ మూవీకి సంబంధించిన షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయినట్టుగా తెలుస్తోంది. ఇక త్వరలోనే కృష్ణ తన కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుండగా అది మాత్రమే కాకుండా కృష్ణ చేతిలో ఇంకో నాలుగైదు చిత్రాలున్నట్టుగా తెలుస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కృష్ణ ఓ పెద్ద హీరో చిత్రంలో స్పెషల్ రోల్‌ను కూడా చేస్తున్నాడని టాక్. నిజానికి టాలీవుడ్‌లో ప్రస్తుతం కొత్త నీరు ప్రవహిస్తోందని చెప్పొచ్చు. నూతన దర్శకులు, హీరో హీరోయిన్లు టాలీవుడ్‌లో సత్తా చాటుతున్నారు. కంటెంట్ కింగ్ అని ఆడియన్స్ భావించి ఆదరిస్తున్న ఈ తరుణంలో యంగ్ జనరేషన్ దుమ్ములేపేస్తోంది. మరి ఈ కమెడియన్ కుమారుడు ఏమి చేయనున్నాడో వేచి చూడాలి మరి.