- నిద్ర పోయి రూ. 9 లక్షలు గెలుచుకున్న ఓ మహిళ
-
బెంగళూరుకు చెందిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ సాయిశ్వరి -
ఓ పరుపుల కంపెనీ స్లీప్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ -
కంపెనీ ఇచ్చిన 2 నెలల పాటు రోజూ రాత్రి 9 గంటలు నిద్రపోవడమే ఆ పని.

నెల జీతం కోసం ఎంతో కష్టపడతాం. రోజుకు కనీసం 10 గంటలైనా పనికి సమయం కేటాయిస్తాం. ఈ క్రమంలో ఒక్కో రోజు కంటి నిండా నిద్ర కూడా కరువవుతుంటుంది. తద్వారా శారీరకంగా, మానసికంగా అలసిపోతుంటాం. అయితే ఓ మహిళ నిద్ర పోయి రూ. 9 లక్షలు గెలుచుకుంది. ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా..? అవును మీరు విన్నది నిజమే.. బెంగళూరుకు చెందిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ సాయిశ్వరి తనకు ఎంతో ఇష్టమైన నిద్రను డబ్బుగా మలిచేందుకు ఆమెకు గొప్ప అవకాశం లభించింది. ఓ పరుపుల కంపెనీ స్లీప్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ నిర్వహించింది. 12 మందిలో ఒకరిగా ఎంపికైంది. కంపెనీ ఇచ్చిన 2 నెలల పాటు రోజూ రాత్రి 9 గంటలు నిద్రపోవడమే ఆ పని.. విజయవంతంగా పూర్తి చేయడంతో రూ. 9 లక్షలు గెలుచుకుంది.
ఈ ఇంటర్న్‌షిప్‌కు సంబంధించి సాయిశ్వరీ మాట్లాడుతూ.. ‘ఇందులో మంచి స్కోర్ చేయడానికి మీరు మేల్కొనే, నిద్రపోయే సమయాన్ని స్థిరంగా ట్రాక్ చేయాలి. అర్థరాత్రి కార్యకలాపాల పట్ల జాగ్రత్తగా ఉండాలని దీని అర్థం. అర్థరాత్రి వరకు మేల్కొని ఉండడం, సోషల్ మీడియాలో స్క్రోలింగ్ చేయడం వంటివి తగ్గించుకోవాలి. ఈ అలవాట్లను వదులుకోవడం కష్టం, కానీ అలావాటు చేసుకుంటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది’. నిద్ర నాణ్యతను మెరుగుపరచడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని సాయిశ్వరి తెలిపింది.