Leading News Portal in Telugu

Medical Student Missing: మెడికో కోసం కొనసాగుతోన్న గాలింపు చర్యలు.. మారేడుమిల్లి పర్యటనలు నిలిపివేత..!


  • మారేడుమిల్లి జలపాతంలో కొట్టుకుపోయిన మెడికల్ విద్యార్థి హరదీప్..

  • కొనసాగుతోన్న గాలింపు చర్యలు..

  • గాలింపు చర్యల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌.. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు..
Medical Student Missing: మెడికో కోసం కొనసాగుతోన్న గాలింపు చర్యలు.. మారేడుమిల్లి పర్యటనలు నిలిపివేత..!

Medical Student Missing: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి జలపాతంలో కొట్టుకుపోయిన మెడికల్ విద్యార్థి హరదీప్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 40 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయి.. వర్షం కారణంగా కొండవాగులు పొంగిపొర్లడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. రెండు రోజుల క్రితం మారేడుమిల్లి విహారయాత్రకు వచ్చిన 13 మంది ఏలూరు ఆశ్రయ్ మెడికల్ కళాశాల విద్యార్థులలో ముగ్గురు వర్షానికి కొండవాగు పొంగిపోర్లడంతో జలతరంగిణి జలపాతంలో గల్లంతయ్యారు. గల్లంతైన మెడికల్ విద్యార్థుల్లో సౌమ్య, అమృత మృతదేహాలు లభ్యం కాగా.. రంపచోడవరం ఏరియా హాస్పిటల్ లో పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. మరోవైపు.. రెండు రోజులు గడిచిన గల్లంతైన మెడికల్ విద్యార్థి హరదీప్ ఆచూకీ లభ్యం కాలేదు. హరదీప్‌ ఆచూకీ కోసం ఫారెస్ట్, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. విహారయాత్రకు వచ్చి కుమారుడు గల్లంతు కావడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు తల్లిదండ్రులు… మరోవైపు.. మారేడుమిల్లి టూరిజాన్ని అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.