Leading News Portal in Telugu

V. Hanumantha Rao: అరికెపుడి గాంధీ అంటే నాకు ఇష్టం.. వీహెచ్ ఆసక్తికర వ్యాఖ్యలు..


  • పార్టీలకు అతీతంగా అరికెపుడి గాంధీ నాకు ఇష్టం..

  • మైనంపల్లి హనుమంతరావు ఆసక్తికర వ్యాఖ్యలు ..

  • బీఆర్ఎస్ మీటింగ్ లకి వాళ్లే కావాలని కరెంట్ కట్ చేస్తున్నారు..
V. Hanumantha Rao: అరికెపుడి గాంధీ అంటే నాకు ఇష్టం.. వీహెచ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

V. Hanumantha Rao: పార్టీలకు అతీతంగా అరికెపుడి గాంధీ నాకు ఇష్టం మని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవాళ్లు ఇవ్వాలో రేపు మన పార్టీలోకి వస్తారు..వాళ్ళని ఏమి అనవద్దు వాళ్ళు కూడా మనవాళ్లే అన్నారు. పార్టీలకు అతీతంగా అరికెపుడి గాంధీ నాకు ఇష్టం అని కీలక వ్యాఖ్యలు చేశారు. 10 కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను కోనుగోలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ ది అన్నారు. కానీ గాంధీ ఒక్క రూపాయి తీసుకోకుండా బీఆర్ఎస్ పార్టీలో చేరారని తెలిపారు. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని తెలిపారు.

కేటీఆర్ రేపటి నుంచి నీకు ఉంటుంది ఇక కాసుకో బిడ్డా అంటూ హెచ్చారించారు. కొండగట్టు లో బస్సు ప్రమాదం, మాసాయిపేట ఘోర రైలు ప్రమాదం జరిగినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారన్నారు. ప్రభుత్వం పోగానే తెలంగాణ, ఆంద్ర అంటూ చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. సెక్రటేరియట్ ను కూల్చి బీఆర్ఎస్ వాళ్ళు నిధులు ఎత్తుకెళ్లారు అన్న ప్రచారం ఉందన్నారు. ఈ రోజు మీరు కట్టిన సెక్రటేరియట్ లో అన్ని లీకులు అవుతున్నాయన్నారు. బీఆర్ఎస్ వాళ్ళవి క్రిమినల్ మైండ్ లు… విద్యుత్ అధికారులు కొందరు బీఆర్ఎస్ వాళ్ళకి సహకరిస్తున్నారరి తెలిపారు. బీఆర్ఎస్ మీటింగ్ లకి వాళ్లే కావాలని కరెంట్ కట్ చేస్తున్నారని మండిపడ్డారు.

హరీష్ రావు, కేటీఆర్ 50 యూట్యూబ్ ఛానెళ్లను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. దోచుకుతిన్న డబ్బులు ఎక్కువై యూట్యూబ్ ఛానెళ్లను బావబామ్మర్దులు నడుపుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వచ్చి 8 నెలలు కాలేదు.. అధికారం పోయాక బీఆర్ఎస్ వాళ్ళకి నిద్ర పట్టడం లేదన్నారు. గోమారంలో జరిగిన ఘటన అదొక ఇష్యూనా..? అని ప్రశ్నించారు. ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేయాలని హరీష్ రావు చూస్తున్నారన్నారు. చిన్న విషయానికి గోమారం రావడం అవసరమా హరీష్ రావు అన్నారు. ఈ పద్దతి మార్చుకోవాలని హరీష్ రావుకి సూచించారు. హరీష్ రావు గోమారం వచ్చి తన స్థాయిని దిగజార్చుకున్నాడన్నారు. హరీష్ రావు మాట్లాడితే సంసారం….మేము చేస్తే వ్యభిచారమా? అని ప్రశ్నించారు. హరీష్ రావు గతంలో IAS అధికారిని ఢిల్లీలో కాళ్లతో తన్నాడు. IPS ఆఫీసర్ ని బూతులు తిన్నాడన్నారు. మేమందరం మాట్లాడితే బీఆర్ఎస్ నాయకులు తట్టుకోలేరన్నారు.
Uttam Kumar Reddy: నిర్లక్ష్యం వహిస్తే సహించం.. అధికారులపై ఉత్తమ్ కుమార్ ఫైర్..