Leading News Portal in Telugu

Minister Seethakka: నేడు ములుగు జిల్లాలో పర్యటించనున్న మంత్రి సీతక్క..


  • నేడు ములుగు నియోజకవర్గంలో మంత్రి సీతక్క పర్యటన..

  • ఏటూరు నాగారంలో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ..

  • ములుగు కలెక్టరేట్ లో మినీ మేడరం జాతరపై రివ్యూ మీటింగ్..
Minister Seethakka: నేడు ములుగు జిల్లాలో పర్యటించనున్న మంత్రి సీతక్క..

Minister Seethakka: నేడు మంత్రి సీతక్క ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 8 గంటల సమయంలో ములుగు గడిగడ్డ ఎస్సీ, ఎస్టీ బాలికల హాస్టల్ ను పరిశీలించారు. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు ఏటూరునాగారంలో చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ చేయనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు చల్పాక గ్రామం, ఏటూరునాగారంలలో పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొననున్నారు. అలాగే, మధ్యాహ్నం 3 గంటలకు ములుగు కలెక్టరేట్ లో మేడారం మినీ జాతరపై అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. ఇక, సాయంత్రం 5:00 గంటలకు ములుగు పోలీస్ స్టేషన్లో సీసీటీవీ కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభించనున్నారు. చివరగా సాయంత్రం. 6 గంటలకు జాకారం గ్రామంలోని వాలీబాల్ టోర్నమెంట్ కార్యక్రమంలో పాల్గొని విజేతలకు మంత్రి సీతక్క బహుమతులు ప్రదానం చేయనున్నారు.

కాగా, నిన్న (మంగళవారం) రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌ వర్మతో పంచాయ‌తీ రాజ్ గ్రామీణాభివృద్ది మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌ల‌ మంత్రి సీత‌క్క సమావేశం అయ్యారు. ములుగు గ్రామ పంచాయతీని మున్సిపాలిటిగా మారుస్తూ అసెంబ్లీ పాస్ చేసిన బిల్లును ఆమోదించాల‌ని విన‌తి ప‌త్రం ఆమె స‌మ‌ర్పించారు. ములుగును మున్సిపాలిటీగా మారుస్తూ 2022లో గత బీఆర్ఎస్ సర్కార్ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది.. కానీ, సాంకేతిక సమస్యలతో ఆ బిల్లు ఇప్పటి వరకు ఆమోదం పొందలేదుఅని చెప్పుకొచ్చారు.