Leading News Portal in Telugu

Chicken Price: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు..!


  • తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చికెన్ ధరలు..

  • ఈరోజు విత్ స్కిన్ కిలో రూ. 213 ఉండగా స్కిన్‌లెస్ కిలో రూ. 243..
Chicken Price: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు..!

Chicken Price: మాసం ప్రియులకు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. మొన్నటి వరకు కాస్త దిగి వచ్చిన చికెన్‌ రేటు ఇప్పుడు ఒక్కసారిగా పెరిగిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరగడంతో కొనుగోలు చేసేందుకు సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ఇక, తెలంగాణలో నిన్న (మంగళవారం) చికెన్ విత్ స్కిన్ (కేజీ) ధర రూ.206 ఉండగా ఇవాళ 213 రూపాయలకు చేరింది. అలాగే స్కిన్ లెస్ చికెన్ ధర (కిలో) రూ.234 నుంచి 243 రూపాయలకు పెరిగి పోయింది. అలాగే, ఆంధ్రప్రదేశ్ లో నిన్న చికెన్ ధర (కిలో) విత్ స్కిన్ రూ.200 ఉండగా 207 రూపాయలకు పెరిగింది. స్కిన్ లెస్ కేజీ ధర రూ.228 నుంచి ఇవాళ 236 రూపాయలకు చేరి పోయింది.

అలాగే, హైదరాబాద్‌లో చికెన్ ధరలు సైతం భారీగానే పెరిగాయి. గత రెండు వారాల క్రితం స్కిన్ లెస్ కిలో రూ. 160 నుంచి 180 రూపాయల మధ్య అమ్మకాలు చేశారు. గత ఆదివారం నుంచి క్రమంగా ధరలు పెరుగి పోయాయి. ఈరోజు (బుధవారం) ధర ఈ విధంగా కొనసాగుతుంది. విత్ స్కిన్ కిలో రూ. 213 ఉండగా స్కిన్‌లెస్ కిలో 243 రూపాయలకు పెరిగింది. ఫాం రేటు రూ. 125, రిటైల్ రూ. 147 చొప్పున అమ్మకాలు కొనసాగిస్తున్నారు.