posted on Sep 25, 2024 2:20PM
మేలు చేసిన వారికి థాంక్స్ చెప్పడం న్యాయం. చేసిన తప్పుకు సారీ చెప్పడం ధర్మం. చేయని తప్పుకు కూడా సారీ చెప్పడం సంస్కారం. ఆ సంస్కారం నారా లోకేష్‌లో పుష్కలంగా వుంది. పలు సందర్భాలలో ఆయన తాను బాధ్యుడు కాని అంశాలకు కూడా క్షమాపణలు కోరారు. ఇప్పుడు మరోసారి అలాంటి సందర్భం వచ్చింది. విశాఖపట్నం సమీపంలోని తాటిచెట్లపాలెం వద్ద తన కారును మంత్రి లోకేష్ కాన్వాయ్‌లోని ఒక కారు ఢీకొట్టడంతో డ్యామేజీ అయిందని కళ్యాణ్ భరద్వాజ్ అనే వ్యక్తి ట్విటర్లో లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై లోకేష్ వెంటనే స్పందించారు. ‘జరిగిన దానికి క్షమాపణ చెబుతున్నాను. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని నా భద్రతా సిబ్బందిని ఆదేశిస్తాను. అలాగే మీ వాహనం డ్యామేజీ రిపేరుకు అయ్యే ఖర్చును నేను భరిస్తాను’ అని రిప్లయ్ ఇచ్చారు.