Leading News Portal in Telugu

Aadhaar Seva Camp : ప్రజలకు అందుబాటులో ఆధార్‌ సేవలు


Aadhaar Seva Camp : ప్రజలకు అందుబాటులో ఆధార్‌ సేవలు

ఆధార్ భారతదేశంలో ఒక గుర్తింపు వ్యవస్థ. ఆధార్ అనేది భారత ప్రభుత్వానికి చెందిన ఒక అతి ముఖ్యమైన గుర్తింపు.. అయితే… ఆధార్ ప్రణాళిక 2009లో ప్రారంభమైంది, ఇది నిరుద్యోగ భృతి, న్యాయమైన బదిలీలు, ప్రభుత్వ పథకాలను పొందడానికి అవసరమైన అతి ముఖ్యమైన పత్రంగా మారింది. ఆధార్ ద్వారా వ్యక్తి యొక్క ప్రత్యేకతను నిర్ధారించవచ్చు, ఇది ఫ్రాడ్ నివారణకు సహాయపడుతుంది. ప్రభుత్వ పథకాలు, సేవలు, ప్రయోజనాలను పొందడం సులభమవుతుంది.

Asaduddin Owaisi: కాశీ బోర్డులో అందరూ హిందువులే.. వక్ఫ్‌లో ముస్లిమేతరులు ఎందుకు?

అయితే.. తాజాగా ఎన్టీవీ ఛానెల్‌లో మాదాపూర్‌ ఆధార్‌ సేవా కేంద్రం తరుఫున ఈనెల 23, 24, 25 తేదీల్లో క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపులో ఎన్టీవీ ఛానెల్‌ ఉద్యోగులతో పాటు.. వారి కుటుంబ సభ్యులు సైతం ఈ సేవలను సద్వినియోగం చేసుకున్నారు. ఆధార్‌ కార్డులో అప్డేట్‌తో పాటు కొత్త ఆధార్‌ కార్డు సేవలను సైతం వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాదాపూర్‌ ఆధార్‌ సేవా కేంద్రం మేనేజర్‌ భవాని ప్రసాద్‌ హరిదాస్‌ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ ఆధార్‌ అనేది ముఖ్యమని తెలిపారు. గత 10 సంవత్సరాలుగా ఆధార్‌ ఆప్డేట్‌ చేసుకోని తప్పనిసరిగా తమ వివరాలు అప్డేట్‌ చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఆధార్‌ ఉన్న ఆధార్‌ కేంద్రాలకు వెళ్లి ఆప్డేట్‌ చేసుకోవాని ఆయన సూచించారు.

DELHI: ప్రభుత్వ భూమిలో “రాణి లక్ష్మీబాయి” విగ్రహ ఏర్పాటు.. భూమి తమదన్న వక్ఫ్ బోర్డు.. చివరికీ..