Leading News Portal in Telugu

UP: మహిళతో లేచిపోయిన తమ్ముడు.. అన్నకు శిక్ష..


  • మహిళతో పారిపోయిన తమ్ముడు..

  • అన్నను పట్టుకుని స్తంభానికి కట్టేసి కొట్టిన మహిళ కుటుంబం..

  • ఉత్తర్ ప్రదేశ్‌లో ఘటన..
UP: మహిళతో లేచిపోయిన తమ్ముడు.. అన్నకు శిక్ష..

UP: తమ్ముడు చేసిన తప్పుకు అన్న శిక్ష అనుభవించాడు. తమ్ముడు ఓ మహిళతో పారిపోవడంతో అన్నను శిక్షించారు. విద్యుత్ స్తంభానికి కట్టేసి కర్రలతో కొట్టినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బదౌన్‌లో చోటు చేసుకుంది. బాధితుడిని అరేలా ప్రాంతానికి చెందిన అర్షద్ హుస్సేన్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

వివరాల ప్రకారం.. అర్షద్ తమ్ముడు అమీర్ కొద్ది రోజుల క్రితం అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళతో పారిపోయి పెళ్లి చేసుకున్నాడు. అయితే, మహిళ కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి అర్షద్ తన ఇంటికి వెళ్తున్న సమయంలో చుట్టుముట్టారు. అతడిని బందీగా తీసుకుని కర్రలు, బెల్టులతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. అర్షద్‌ని ఉదయం రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టారు. అతడిని పోలీస్ స్టేషన్ తీసుకువచ్చే క్రమంలో కూడా దాడి చేశారు. ప్రస్తుతం గాయపడిన బాధితుడిని జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు.

ఈ కేసులో పాత పగలు ఉన్నాయని, దీంతోనే దాడి జరిగినట్లు డేటాగంజ్ సీఐ కేకే తివారీ తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో సంబంధిత సెక్షన్ల కింద తొమ్మిది మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని తివారీ తెలిపారు. తదుపరి చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.