Leading News Portal in Telugu

Gold Limit in Home: ఇంట్లో ఎంత బంగారాన్ని ఉంచుకో వచ్చో తెలుసా? నియమాలు ఏం చెబుతున్నాయంటే..?


  • భారతదేశంలో బంగారం ఆభరణంగానే కాకుండా పెట్టుబడి పరంగా కూడా..
  • దేశంలోని వివాహిత మహిళ తన వద్ద 500 గ్రాముల వరకు .
  • పెళ్లి కాని అమ్మాయిలు తమ వద్ద 250 గ్రాముల బంగారం.
  • ఒక వ్యక్తి తన వద్ద 100 గ్రాముల బంగారాన్ని ఉంచుకోవచ్చు.
Gold Limit in Home: ఇంట్లో ఎంత బంగారాన్ని ఉంచుకో వచ్చో తెలుసా? నియమాలు ఏం చెబుతున్నాయంటే..?

Gold Limit in Home: భారతదేశంలో బంగారం ఆభరణంగానే కాకుండా పెట్టుబడి పరంగా కూడా ముందుంది. దీనితో పాటు, ఇతర దేశాల కంటే దేశంలో బంగారం వినియోగం కూడా ఎక్కువగా ఉంది. వివాహ వేడుకలు లేదా పండుగలు నగల షోరూమ్‌ లతో నిండి ఉంటాయి. వీటన్నింటి నేపథ్యంలో, భారతదేశంలో ఒక వివాహిత తన వద్ద ఎంత బంగారం ఉంచుకోవచ్చో మీకు తెలుసా.? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) దీనికి సంబంధించి కొన్ని నిబంధనలను పెట్టిందని, దీని కారణంగా ఎక్కువ బంగారాన్ని ఉంచుకోవడంపై పన్ను విధించబడుతుందని తెలుసా..?

Lipstick: లిప్‌స్టిక్‌ ఎంత పని చేసింది.. ఏకంగా ఉద్యోగానికే ఎసరు పెట్టిందిగా..

నిబంధనల ప్రకారం.. దేశంలోని వివాహిత మహిళ తన వద్ద 500 గ్రాముల వరకు బంగారు ఆభరణాలను ఉంచుకోవచ్చు. మరోవైపు, పెళ్లి కాని అమ్మాయిల గనుక ఇంట్లో ఉంటే, పెళ్లి కాని అమ్మాయిలు తమ వద్ద 250 గ్రాముల బంగారం లేదా బంగారు ఆభరణాలను ఉంచుకోవచ్చు. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి తన వద్ద 100 గ్రాముల బంగారాన్ని ఉంచుకోవచ్చు. అతను వివాహితుడైనా, అవివాహితుడైనా. మీ వద్ద ఇంతకంటే ఎక్కువ బంగారం ఉన్నట్లు తేలితే, అదనపు బంగారంపై పన్ను వర్తిస్తుంది. ఇక్కడ, మీరు బంగారం వారసత్వంగా పొందినట్లయితే, అది పన్ను రహితం అని గుర్తుంచుకోండి. కానీ., మీరు దానిని విక్రయిస్తే అప్పుడు పన్ను వర్తిస్తుంది. అయితే, దీని కోసం మీరు చట్టపరమైన వీలునామా లేదా ఇతర రుజువును అందించాలి. లేకుంటే., అది పెనాల్టీ వర్గంలోకి వస్తుంది.

BSNL: అతి తక్కువ ధరలో ఇంటర్నెట్ రాకెట్ వేగంతో 5000GB డేటా!