Leading News Portal in Telugu

T20 World Cup 2024: టీమిండియా మహిళా క్రికెటర్లను కలిసిన టాలీవుడ్ హీరో.. వీడియో వైరల్!


  • అక్టోబర్ 3 నుంచి మహిళా ప్రపంచకప్‌
  • న్యూజిలాండ్‌తో భారత్‌ తొలి మ్యాచ్
  • మహిళా క్రికెటర్లను కలిసిన టాలీవుడ్ హీరో
T20 World Cup 2024: టీమిండియా మహిళా క్రికెటర్లను కలిసిన టాలీవుడ్ హీరో.. వీడియో వైరల్!

Rana Daggubati Cheers India Women’s Team in Dubai: యూఏఈ వేదికగా టీ20 మహిళా ప్రపంచకప్‌ 2024 అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్‌ వేదికగా పొట్టి కప్ జరగాల్సి ఉన్నా.. బంగ్లాలో అల్లర్ల నేపథ్యంలో టోర్నీని యూఏఈకి ఐసీసీ మార్చింది. మొత్తం పది జట్లు రెండు గ్రూప్‌లుగా ఆడనున్నాయి. ఫైనల్‌ మ్యాచ్‌ అక్టోబర్ 20న జరగనుంది. గ్రూప్‌ స్టేజ్‌లో అక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో భారత్‌ తొలి మ్యాచ్ ఆడనుంది. మెగా టోర్నీ కోసం బుధవారం భారత్‌ దుబాయ్ చేరుకుంది.

దుబాయ్‌లో భారత మహిళా క్రికెటర్లు దిగిన వేళ.. వారి ఓ స్పెషల్ గెస్ట్‌ ఎదురుపడ్డారు. ఆ స్పెషల్ గెస్ట్‌ ఎవరో కాదు.. టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి. బుధవారం రానా దుబాయ్‌కు వెళ్లగా.. అదే సమయంలో భారత మహిళా క్రికెటర్లు విమానాశ్రయంలో ఎదురుపడ్డారు. భారత క్రికెటర్లతో రానా ఫొటోలకు ఫోజిలిచ్చారు. టీ20 ప్రపంచకప్‌ను భారత్‌కు పట్టుకురావాలంటూ.. ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. ‘దుబాయ్ విమానాశ్రయంలో అద్భుతమైన వ్యక్తులను కలిశా. టీమిండియా విజేతగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్‌ ది బెస్ట్ భారత్’ అని రానా పేర్కొన్నారు. ఈ వీడియోను బీసీసీఐ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. కాంత, వేట్టయాన్ సినిమాల్లో రానా నటిస్తున్న విషయం తెలిసిందే.