posted on Sep 26, 2024 9:45AM
తెలుగుదేశం నాయకుడు వంగవీటి రాధాకు గుండెపోటు వచ్చింది. గురువారం (సెప్టెంబర్ 26) తెల్లవారు జామున రాధాకు గుండెపోటు రావడంతో ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
వంగవీటి రాధా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మరో 48 గంటలు ఆయనను అబ్జర్వేషన్ లో ఉంచుతామని పేర్కొన్నారు. ప్రస్తుతం విజయవాడలోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
కాగా వంగవీటి రాధా గుండెపోటుకు గురయ్యారన్న వార్తతో ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రివద్దకు తరలి వచ్చారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. పలువురు రాజకీయనాయకులు, మిత్రులు ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.