Leading News Portal in Telugu

Musi River: మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారుల సర్వే.. కూల్చి వేసే ప్రాంతాలకు మార్కింగ్..


  • మూసీ నది పరివాహక ప్రాంతంలో పోలీసుల బందోబస్తు మధ్య అధికారుల సర్వే..

  • హిమాయత్‌నగర్ తహసీల్దార్ సంధ్యారాణి ఆధ్వర్యంలో సర్వే..
Musi River: మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారుల సర్వే.. కూల్చి వేసే ప్రాంతాలకు మార్కింగ్..

Musi River: హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మూసీ నది పరివాహక ప్రాంతంలో పోలీసుల బందోబస్తు మధ్య అధికారుల సర్వే కొనసాగుతోంది. ఇవాళ ఉదయం నుంచి 16 బృందాలు సర్వే నిర్వహిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 4 బృందాలు, మేడ్చల్ మల్కాజిగిరిలో 5 బృందాలతో సర్వే నిర్వహిస్తున్నారు. నదీగర్భంలో నివాసముంటున్న వారి నిర్మాణాల వివరాలను రెవెన్యూ అధికారులు ఆరా తీస్తున్నారు. మూసీ నదిలో బఫర్‌జోన్‌లో నిర్మాణాలను గుర్తించనున్నారు. మూసీ పరివాహక ప్రాంతాలైన చాదర్‌ఘాట్‌, మూసానగర్‌, శంకర్‌నగర్‌లో అధికారులు సర్వే నిర్వహించారు. హిమాయత్‌నగర్ తహసీల్దార్ సంధ్యారాణి ఆధ్వర్యంలో కొనసాగుతోంది. గోల్కొండ పరిధిలోని ఇబ్రహీం బాగ్ ప్రాంతంలోనూ సర్వే చేశారు. లంగర్‌హౌస్‌ డిఫెన్స్‌ కాలనీలో అధికారులు సర్వే చేయనున్నారు. అయితే పలు ప్రాంతాల్లో సర్వేకు వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకుంటున్నారు. మూసీ నిర్వాసితుల సర్వే అధికారులకు ఇది సవాల్‌గా మారింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు ఇళ్లను మార్కింగ్ చేస్తున్నారు.
Mallu Bhatti Vikramarka: హూవర్ డ్యామ్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..