- ఏలూరులో కాల్ మనీ దందాలు.
- ఒక్కొక్కరిగా బయటికి వస్తున్న బాధితులు..
-
తీసుకున్న అప్పుకి పదింతలు చెల్లించినా మహిళలకు ఆగని లైంగిక వేధింపులు.. -
అధిక వడ్డీలు చెల్లించలేక ఊరు వదిలి వెళ్ళిపోతున్న బాధితులు..

Call Money: తాజాగా ఏలూరులో కాల్ మనీ దందాలు సంబంధించి వరుసగా కేసులు వెలుగు చూస్తున్నాయి. బాధితులు ఒక్కొక్కరిగా బయటికి వస్తు తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. తీసుకున్న డబ్బులకి పదింతలు చెల్లించినా మహిళలకు లైంగిక వేధింపులు ఆగడంలేదని ఆవేదన చెందుతున్నారు. ముఖయంగా అధిక వడ్డీలు చెల్లించలేకపోవడంతో, అప్పులు తీర్చలేక ఊరు వదిలి వెళ్ళిపోయే బాధితులు గతంలో కూడా పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగలేదని కొందరు బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయం సంబంధించి ఏలూరు జిల్లా ఎస్పీకి పిర్యాదు చేసేందుకు సిద్ధం అయిన బాధితులు, ప్రజా ప్రతినిధులను కలుస్తూ తమ కష్టాలని వెళ్ళపోసుకుంటున్నారు. ఇదివరకు కూడా ఎలాంటి దందాలను రెండు తెలుగు రాష్ట్రాలలో మనం చూసాం. మళ్లీ ఇలాంటి చర్యలే ఎక్కువతున్న నేపథ్యంలో మరి పోలీసులు ఎలాంటి చర్యలు చేపడతారో చూడాలి మరి.