Leading News Portal in Telugu

Group-1 Hall Tickets: త్వరలో గ్రూప్‌-1 మెయిన్‌ హాల్‌టికెట్లు.. పరీక్షలు ఎప్పటి నుంచి అంటే..


  • అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్-1 మెయిన్ పరీక్షలు..

  • మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు..
Group-1 Hall Tickets: త్వరలో గ్రూప్‌-1 మెయిన్‌ హాల్‌టికెట్లు.. పరీక్షలు ఎప్పటి నుంచి అంటే..

Group-1 Hall Tickets: గ్రూప్-1 మెయిన్ పరీక్షలు అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించేందుకు టీజీపీఎస్సీ సన్నాహాలు మొదలయ్యాయి. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు మూడు గంటలపాటు జరగనుంది. వారం పది రోజుల్లో హాల్ టికెట్లను విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ కసరత్తు చేపట్టింది. అక్టోబర్ 21న జనరల్ ఇంగ్లీష్ పేపర్‌తో పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కానీ జనరల్ ఇంగ్లిష్ అర్హత పరీక్ష మాత్రమే ఉంటుంది. ఈ మార్కులు మెయిన్స్ స్కోర్‌కు పరిగణనలోకి తీసుకోరు. అయితే అభ్యర్థులు ఈ పరీక్షలో అర్హత సాధించడం తప్పనిసరి.

Read also: Nani : నెట్ ఫ్లిక్స్ లో సరిపోదా శనివారం తాండవం..!

అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్-1 మెయిన్ పరీక్షలు..

అక్టోబర్ 21న జనరల్ ఇంగ్లీష్ పేపర్‌తో పరీక్షలు మొదలు
అక్టోబర్ 22న జనరల్ ఎస్సే (పేపర్-1),
అక్టోబర్ 23న హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ (పేపర్-2),
అక్టోబర్ 24న ఇండియన్ సొసైటీ కాన్‌స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ (పేపర్-3),
అక్టోబర్ 25న ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ (పేపర్-4),
అక్టోబర్ 26వ తేదీన సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌(పేపర్‌-5)
అక్టోబర్ 27న తెలంగాణ ఉద్యమం, రాష్ట్రావతరణ (పేపర్-7) నిర్వహిస్తారు.

రాబోయే పరీక్షల గురించి అభ్యర్థులకు అవగాహన కల్పించేందుకు TGPSC వెబ్‌సైట్‌లో పేపర్ వారీగా నమూనా సమాధానాల బుక్‌లెట్‌లను పొందుపరిచింది. అయితే ఈ సమాధానాల బుక్‌లెట్లన్నీ ఒకేలా ఉండవు. కాగితంపై ఆధారపడి అవి భిన్నంగా ఉంటాయి. అన్ని గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు ఒకే హాల్ టిక్కెట్‌తో హాజరు కావాలి. మొదటి పరీక్షకు ఉపయోగించే హాల్‌టికెట్‌నే అన్ని పరీక్షలకు ఉపయోగించాలి. ఎందుకంటే ప్రతిరోజు ఇన్విజిలేటర్ హాల్ టికెట్ పై అభ్యర్థి సంతకంపై సంతకం కూడా చేస్తారు. ఈ హాల్‌టికెట్‌ను పరీక్షలు ముగిసే వరకు జాగ్రత్తగా ఉంచుకోవాలి. అంతేకాదు.. రిక్రూట్‌మెంట్ పూర్తయ్యే వరకు ఇదే హాల్ టికెట్‌ను దాచిపెట్టాలని టీజీపీఎస్సీ సూచించింది. పరీక్షకు గంట ముందు పరీక్షా కేంద్రాల గేట్లను మూసివేస్తారు. అభ్యర్థులు చెప్పులు ధరించి మాత్రమే పరీక్షకు హాజరు కావాలి. బూట్లతో అస్సలు రావద్దు. పరీక్షా కేంద్రాల్లో నిల్వ సౌకర్యాలు లేవు. కాబట్టి విలువైన వస్తువులు తీసుకురావద్దు. అభ్యర్థులు ముందుగా పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లాలని కమిషన్‌ పేర్కొంది.
Hyderabad Metro: 116.2 కిలోమీట‌ర్ల‌లో మెట్రో రెండు ద‌శ నిర్మాణం.. కొత్త ఫ్యూచ‌ర్ సిటీకి ఏర్పాటు