Mega Star : గ్లోబల్ స్టార్ ప్రభాస్ స్టార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సలార్, కల్కి సినిమాల హిట్ తో ఫుల్ స్వింగులో ఉన్నారు ప్రభాస్. అదే ఉత్సాహంతో చాలా సినిమాలు లైన్లో పెట్టారు. ఇలా లైనప్‌లో భారీ అంచనాలు ఉన్న సినిమా ‘స్పిరిట్’. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో ఉన్న ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే రూమర్ వైరల్ అవుతుంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే, స్టార్ జంట సైఫ్ అలీఖాన్ – కరీనా కపూర్ కూడా స్పిరిట్ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మెగాస్టార్ మమ్ముట్టి పేరు కూడా వినిపిస్తోంది. ఐతే, టీమ్ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
కాగా ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ సినిమా రాబోతుంది. ‘స్పిరిట్’ మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.. సందీప్ రెడ్డి వంగా నుంచి మరో వినూత్న సినిమా రాబోతుందని అంటున్నారు. అలాగే, సందీప్ రెడ్డి వంగా మార్క్ యాక్షన్ సీన్స్ అండ్ వైల్డ్ ఎలిమెంట్స్ సినిమాలో పుష్కలంగా ఉంటాయని తెలుస్తోంది. దాదాపు రూ.400 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కి్స్తున్నారు మేకర్స్. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ నిర్మిస్తున్నాయి.