- టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా ఉమెన్స్ జట్టు బోణీ
-
పాకిస్తాన్ పై 6 వికెట్ల తేడాతో భారత్ గెలుపు -
106 పరుగుల లక్ష్యాన్ని 7 బంతులు ఉండగానే చేధించిన టీమిండియా.
టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా ఉమెన్స్ జట్టు బోణీ కొట్టింది. పాకిస్తాన్ పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 106 పరుగుల లక్ష్యాన్ని 7 బంతులు ఉండగానే చేధించింది. భారత్ బ్యాటింగ్‌లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ క్రీజులో ఉండి జట్టును విజయం వైపు తీసుకెళ్లింది. 29 పరుగుల ఇన్నింగ్స్ ఆడింది. భారత్ బ్యాటింగ్‌లో ఓపెనర్ షఫాలీ వర్మ (32) రాణించింది. జెమిమా రోడ్రిగ్స్ (23) భారత్ విజయం సాధించింది. భారత్ బ్యాటింగ్‌లో స్మృతి మంధాన (7), దీప్తి శర్మ (7) పరుగులు చేశారు. పాకిస్తాన్ బౌలింగ్‌లో ఫాతిమ సనా 2 వికెట్లు తీసింది. సాధియా ఇక్బాల్, సోహైల్ తలో వికెట్ సంపాదించారు.
Low Blood Pressure: “బీపీ” అకస్మాత్తుగా తగ్గడానికి గల కారణాలు?
మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. పాకిస్తాన్ బ్యాటింగ్‌లో నిధా దార్ ఒక్కరే ఒంటరి పోరాటం చేసింది. 34 బంతుల్లో ఒక ఫోర్ సాయంతో 28 పరుగులు చేసింది. మిగతా బ్యాటర్లంతా తక్కువ స్కోరుకే పెవిలియన్ బాట పట్టారు. పాక్ బ్యాటర్లలో మునీబా అలీ (17), సయేద అరూబ్ షా (14), ఫాతిమా సనా (13), సిద్రా అమీన్ (8) పరుగులు చేశారు. భారత్ బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో పాకిస్తాన్ బ్యాటర్లను పెవిలియన్ కు పంపించారు. భారత్ బౌలర్లలో అరుంధతీ రెడ్డి 3 వికెట్లతో చెలరేగింది. శ్రేయాంక పాటిల్ 2 వికెట్లు తీసింది. రేణుకా సింగ్, దీప్తి శర్మ, ఆశ శోభన తలో వికెట్ సంపాదించారు.
West Bengal: బెంగాల్‌లో మరో రేప్ కేసు.. పొరుగింటి మహిళపై అత్యాచారం, విషమిచ్చి హత్య..