Leading News Portal in Telugu

Breaking: చెన్నై మెరీనా బీచ్‌ దగ్గర ఎయిర్‌ షోలో తొక్కిసలాట.. నలుగురు మృతి


  • చెన్నై మెరీనా బీచ్‌ దగ్గర ఎయిర్‌ షోలో తొక్కిసలాట

  • ఎయిర్‌ షో చూసేందుకు భారీగా తరలివచ్చిన జనం

  • తొక్కిసలాటలో నలుగురు మృతి.. పలువురికి తీవ్రగాయాలు.
Breaking: చెన్నై మెరీనా బీచ్‌ దగ్గర ఎయిర్‌ షోలో తొక్కిసలాట.. నలుగురు మృతి

చెన్నైలోని మెరీనా బీచ్‌ దగ్గర ఎయిర్‌ షోలో తొక్కిసలాట జరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో ఎయిర్‌ షో చూసేందుకు జనం పోటెత్తారు. దీంతో.. మెరీనా బీచ్ మొత్తం జనసంద్రంగా మారింది. బీచ్ కు వచ్చే రోడ్లు, మెట్రో రైళ్లు కిక్కిరిసిపోయాయి. ఈ క్రమంలోనే మెరీనా బీచ్ రైల్వే స్టేషన్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో నలుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. డీహైడ్రేషన్ కారణంగా దాదాపు 265 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వేడి వాతావరణం కారణంగా కొంతమంది అస్వస్థతకు గురయ్యారు. మృతులను శ్రీనివాసన్ (48), కార్తికేయన్ (34), జాన్ బాబు (56), దినేష్‌గా గుర్తించారు. IAF తన 92వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. 13 లక్షల మందికి పైగా ప్రజలు రైలు, మెట్రో, కార్లు మరియు బస్సుల ద్వారా వేదిక వద్దకు చేరుకుని ప్రదర్శనను వీక్షించారు. ఎయిర్ షో కోసం అతిపెద్ద సమావేశాన్ని ఆకర్షించినందుకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఈ ఈవెంట్‌ను నమోదు చేశారు.