- ప్రైవేట్ బొగ్గు గనిలో పేలుడు.
- పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లాలోని ఖోరాషోల్ బ్లాక్ వదులియా గ్రామంలో ఘటన.
- 7 మంది కూలీలు ప్రాణాలు కోల్పోగా..
- పలువురు గాయపడ్డారు.

Birbhum coal Mine Blast: పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లాలోని ఖోరాషోల్ బ్లాక్ వదులియా గ్రామంలోని ప్రైవేట్ బొగ్గు గనిలో పేలుడు సంభవించడంతో అక్కడ తీవ్ర పరిస్థితిని సృష్టించింది. సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో 7 మంది కూలీలు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ ఘటనలో క్షతగాత్రులందరినీ సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఇక ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Tomato Price : మళ్లీ మోత మోగిస్తున్న టమాటా ధర.. హైదరాబాద్ లో కిలో రూ.100
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పేలుడు తర్వాత గని కూలిపోవడంతో.. అక్కడి పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారిందని తెలిపారు. గనిలో బ్లాస్టింగ్ పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బొగ్గు తవ్వకాలలో ఈ తరహా పేలుడు జరగడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు చెబుతున్నారు. అందిన సమాచారం ప్రకారం, చాలా మంది కూలీల మృతదేహాలు ఛిద్రమైన స్థితిలో వెలికి తీశారు. ఈ ఘటన తర్వాత వదులియాలోని గంగారామ్‌చక్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కొలీరీ (జీఎంపీఎల్)లో కలకలం రేగింది. ఈ ఘటనతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Sanath Jayasuriya: అప్పటి వరకు శ్రీలంక ప్రధాన కోచ్‌గా సనత్ జయసూర్య
ఈ సంఘటనను చూసిన బదురియా గ్రామానికి చెందిన ఒక ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ.., మేము పని చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా పెద్ద శబ్దం వచ్చింది. గని కోసమే ఇలా జరుగుతుందని తొలుత భావించినా పేలుడు కారణంగా కొందరు కార్మికులు మృతి చెందినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని తెలిపాడు. వీరంతా పక్క గ్రామాల్లో ఇళ్లు ఉండి రోజూ ఉదయం పనులకు వచ్చేవారు. ఇలాంటి సంఘటన జరుగుతుందని ఊహించలేకపోయానని అతను తెలిపాడు.