Leading News Portal in Telugu

Sanath Jayasuriya: అప్పటి వరకు శ్రీలంక ప్రధాన కోచ్‌గా సనత్ జయసూర్య


  • శ్రీలంక ప్రధాన కోచ్‌గా సనత్ జయసూర్య.
  • 2026 మార్చి 31 వరకు కోచ్‌గా.
  • ప్రస్తుతం జయసూర్య జట్టుకు తాత్కాలిక కోచ్‌గా ఉన్నారు.
Sanath Jayasuriya: అప్పటి వరకు శ్రీలంక ప్రధాన కోచ్‌గా సనత్ జయసూర్య

Sanath Jayasuriya: శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) తన జట్టుకు మార్చి 31, 2026 వరకు మాజీ వెటరన్ ఆటగాడు సనత్ జయసూర్యను కోచ్‌గా నియమించింది. ప్రస్తుతం జయసూర్య జట్టుకు తాత్కాలిక కోచ్‌గా ఉన్నారు. భారత్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌కు, ఆ తర్వాత జరిగిన ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ లతో జరిగిన టెస్టు సిరీస్‌కు కోచ్‌గా నియమించబడ్డాడు. ఇకపోతే జయసూర్య కోచ్‌గా వచ్చిన తర్వాత శ్రీలంక ఆటతీరు అద్భుతంగా కొనసాగింది. 2024 టీ20 ప్రపంచకప్ తర్వాత క్రిస్ సిల్వర్‌ వుడ్ కోచ్ పదవికి రాజీనామా చేశాడు.

ఆ తర్వాత జయసూర్య కోచ్‌గా మారిన తర్వాత భారత క్రికెట్ జట్టు 27 ఏళ్ల తర్వాత శ్రీలంక క్రికెట్ జట్టుతో వన్డే సిరీస్‌ను కోల్పోయింది. దీంతో పాటు ఇంగ్లండ్ గడ్డపై జరిగిన టెస్టు మ్యాచ్‌లోనూ శ్రీలంక విజయం సాధించింది. న్యూజిలాండ్ క్రికెట్ జట్టు 2-మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు శ్రీలంక వచ్చినప్పుడు కూడా 2-0 తేడాతో సిరీస్‌ను గెలుచుకుంది. ఈ అద్భుత ప్రదర్శన కారణంగా 2026 వరకు జయసూర్యకు ఈ పదవి లభించింది. ప్రస్తుతం శ్రీలంక ఫామ్ కు ఇంకెన్ని సంచనాలను సృష్టిస్తారో చూడాలి మరి.