Leading News Portal in Telugu

Women’s T20 World Cup: శ్రీలంకపై భారత్ ఘన విజయం..


  • శ్రీలంకపై భారత్ ఘన విజయం
  • 82 పరుగుల తేడాతో గెలుపు
  • 19.5 ఓవర్లలో 90 పరుగులకు ఆలౌటైన శ్రీలంక.
Women’s T20 World Cup: శ్రీలంకపై భారత్ ఘన విజయం..

ఉమెన్స్ టీ20 ప్రపంచకప్‌ 2024లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 82 పరుగుల తేడాతో గెలుపొందింది. 173 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. 19.5 ఓవర్లలో 90 పరుగులకే ఆలౌటైంది. శ్రీలంక బ్యాటింగ్‌లో అత్యధికంగా కవిష దిల్హారి (21), అనుష్క సంజీవని (20) పరుగులు చేసింది. ఆ తర్వాత కాంచన (19), నీలక్షికా సిల్వా (8), ప్రబోధిని (9) పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. భారత్ బౌలింగ్‌లో అరుంధతి రెడ్డి, ఆశ శోభన చెరో 3 వికెట్లతో చెలరేగారు. రేణుకా సింగ్ 2, శ్రేయాంక పాటిల్, దీప్తి శర్మ తలో వికెట్ తీశారు.

మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ 3 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ఓపెనర్లు మంధాన (50), షెఫాలీ (43) మంచి ఆరంభాన్ని అందించారు. ఆ తర్వాత హర్మన్‌ప్రీత్ (52) దూకుడుగా బ్యాటింగ్ చేసింది. జెమిమా రోడ్రిగ్స్ (16), రిచా ఘోష్‌ (6) పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో కెప్టెన్ చమరి ఆటపట్టు, కాంచన తలో వికెట్ తీశారు. కాగా.. ఈ మ్యాచ్ విజయంతో టీమిండియా సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. కాగా.. తర్వాతి మ్యాచ్ ఆదివారం ఆస్ట్రేలియాతో తలపడనుంది.