- సర్వీస్ గన్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
- కలెక్టరెట్ లోని స్ట్రాంగ్ రూం వద్ద విధులు నిర్వహిస్తున్న జీ శ్రీనివాస్
- సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ
- వివరాలు ఆరా తీస్తున్న పోలీసులు

మహబూబాబాద్ కలెక్టరెట్ లోని స్ట్రాంగ్ రూం వద్ద విధులు నిర్వహిస్తున్న జీ శ్రీనివాస్ సర్వీస్ గన్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య గల కారణాలు తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పరిశీలిస్తున్నారు. వివరాలు ఆరా తీస్తున్నారు. ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డరనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. విధుల్లో ఉన్నప్పుడే ఉండగానే ఈ ఘటన చోటుచేసుకుంది.ఈ విషయం తెలిసిన కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
READ MORE: Haryana Elections: కాంగ్రెస్ గెలిచే వాతావరణాన్ని సృష్టిస్తే, ఆయన నాశనం చేశాడు.. రైతు నాయకుడి సంచలన వ్యాఖ్యలు..