Leading News Portal in Telugu

Ajay Bhupathi: అజయ్ భూపతి నెక్స్ట్.. ఆ స్టార్ హీరో కొడుకుతో కాదు కానీ?


Ajay Bhupathi: అజయ్ భూపతి నెక్స్ట్.. ఆ స్టార్ హీరో కొడుకుతో కాదు కానీ?

Ajay Bhupathi Next Movie Fixed with Virat Karna: ఆర్ఎక్స్ 100 సినిమాతో దర్శకుడిగా మారిన అజయ్ భూపతి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ఇండస్ట్రీలోనే ఒక ట్రెండ్ సెట్టింగ్స్ సినిమాగా కూడా నిలిచింది. తర్వాత ఆయన చేసిన మహాసముద్రం సినిమా మాత్రం డిజాస్టర్ అయింది. ఆ తర్వాత పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా చేసిన మంగళవారం సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. అయితే ఆ తర్వాత ఇప్పటివరకు ఆయన మరో సినిమా ప్రకటించలేదు. అయితే ఆయన తమిళ స్టార్ హీరో విక్రమ్ కొడుకు విక్రమ్తో ఒక సినిమా చేయవచ్చు అనే ప్రచారం జరిగింది. నిజానికి ఆ మేరకు సంప్రదింపులు కూడా జరిగాయి. అయితే అట్నుంచి గ్రీన్ సిగ్నల్ ఏమీ రాలేదని తెలుస్తోంది. ఇప్పుడు ఆయన పెదకాపు సినిమా హీరో విరాట్ కర్ణ కి ఒక కథ చెప్పాడని కథ నచ్చడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ప్రాజెక్టు ఫైనలైజ్ అయిందని తెలుస్తోంది.

Nidhhi Agerwal: ఒకే రోజు.. రెండు రాష్ట్రాల్లో రెండు సినిమాల షూట్!

ఇప్పటికే విరాట్ కర్ణ నాగబంధం అనే సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా ప్యాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతోంది. ఇక అజయ్ భూపతితో సినిమాకి కర్ణ అనే టైటిల్ ఫిక్స్ చేయబోతున్నారు. వచ్చేయేడాది మొదట్లో షూటింగ్ పట్టాలు ఎక్కే అవకాశం ఉంది. మిరియాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మించబోతున్నారు. విరాట్ కర్ణకు ఆయన బంధువు అవుతారు. పెద్ద కాపు సినిమాని కూడా ఆయనే నిర్మించారు. రెండో సినిమా మాత్రం కొత్త బ్యానర్ లో చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ మూడో సినిమా మాత్రం 40 కోట్ల రూపాయలు బడ్జెట్ వెచ్చింది మళ్ళీ మిరియాల రవీందర్ రెడ్డి నిర్మించబోతున్నట్లుగా తెలుస్తోంది. నాగబంధం సినిమాతో పాటు ఈ కర్ణ సినిమాని కూడా ఒకేసారి షూట్ చేసే ప్రణాళికలైతే ఉన్నాయి.