Leading News Portal in Telugu

Minister Narayana: కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో మంత్రి నారాయణ భేటీ


  • ఢిల్లీలో రెండోరోజు ఏపీ మంత్రి నారాయణ పర్యటన
  • కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో భేటీ
  • విశాఖ..విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుపై కీలక చర్చ
Minister Narayana: కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో మంత్రి నారాయణ భేటీ

Minister Narayana: ఢిల్లీలో రెండో రోజు ఏపీ మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి నారాయణ పర్యటించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో మంత్రి నారాయణ, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ సమావేశమయ్యారు. విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులు ముందుకు తీసుకువెళ్లే అంశాలపై కీలకంగా చర్చించారు.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన రెండు ప్రాజెక్టులపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని మంత్రి నారాయణ కోరారు. విజయవాడ మెట్రోను రాజధాని అమరావతికి అనుసంధానించే ప్రతిపాదనలు కూడా ఇప్పటికే కేంద్రానికి పంపినట్లు ఖట్టర్ దృష్టికి నారాయణ తీసుకెళ్లారు. అమృత్ 2 పథకం గత ఐదేళ్లుగా రాష్ట్రంలో అమలుకు నోచుకోలేదని..ఆ పథకాన్ని ఇప్పుడు అమలుకు ఉన్న మార్గాలపై ఇరువురు మధ్య కీలక చర్చ జరిగినట్లు తెలిసింది. మంత్రి నారాయణ ప్రతిపాదనలపై కేంద్రమంత్రి ఖట్టర్ సానుకూలంగా స్పందించారు.