Leading News Portal in Telugu

YASH : KGF – 3 ఫిక్స్.. యశ్ కీలక వ్యాఖ్యలు


  • కన్నడ హీరో యశ్ ను స్టార్ గా మార్చిన కేజిఎఫ్
  • ప్రస్తుతం టాక్సిక్ లో నటిస్తున్న యశ్
  • కేజిఎఫ్ – 3 పై యశ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
YASH : KGF – 3 ఫిక్స్.. యశ్ కీలక వ్యాఖ్యలు

కన్నడ స్టార్ హీరో యశ్‌ నటించిన పాన్ ఇండియా హిట్ సినిమా కేజీఎఫ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రిలీజ్ కు ముందు ఎవరికీ అంతగా అంచనాలు లేవు. కానీ రిలీజ్ రోజు మొదటి ఆట ముగిసే నాటికి కేజీఎఫ్‌ మౌత్ టాక్ తో బ్లాక్ బస్టర్ విజయం అందుకుని ఎవరు ఊహించని వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. మొదటి భాగానికి సీక్వెల్ గా వచ్చిన కేజీఎఫ్‌ -2 కూడా ఫస్ట్ పార్ట్ కంటే పెద్ద సక్సెస్ సాదించింది.

ఈ సినిమా తర్వాత అటు హీరో యశ్‌ ఇటు దర్శకుడు ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం యశ్‌ టాక్సిక్ అనే సినిమాలో నటిస్తున్నాడు. అయితే కేజీఎఫ్ -2 ఎప్పుడు వస్తుందని ఫాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఆ మధ్య చిత్ర నిర్మాణ సంస్థ ‘కేజీఎఫ్‌3’పై స్పష్టత ఇస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. ‘‘రాఖీ భాయ్‌ 1978 నుంచి 1981 వరకు ఎక్కడ ఉన్నారు?’’ అంటూ విడుదలైన ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తాజాగా హీరో యాష్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కేజీఎఫ్‌ – 3 గురించి ఎప్పుడు వస్తుందంటూ ప్రశ్నించారు.

అందుకు సమాధానం గా యష్ బదులిస్తూ “మేము వాగ్దానం చేసినట్లుగా కేజీఎఫ్‌ – 3’ ఖచ్చితంగా జరుగుతుంది. మాకు ఒక ఆలోచన ఉంది, సరైన సమయం వచ్చినప్పుడు దాని గురించి వెల్లడిస్తాం, కేజీఎఫ్‌- 3 అది భారీగా ఉంటుంది. ప్రేక్షకులు గర్వపడే విధంగా మేము చేస్తాము, ఎందుకంటే ఇది ఒక కల్ట్. నేను మరియు ప్రశాంత్ నీల్ దానిపై చర్చిస్తున్నాము” అని న్నారు.