Leading News Portal in Telugu

YS Jagan: నేడు గుంటూరు, కడప జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన..


  • ఇవాళ గుంటూరు.. కడప జిల్లాల్లో జగన్ పర్యటన..

  • హత్యకు గురైన యువతి.. బాలిక కుటుంబాలకు పరామర్శ..
YS Jagan: నేడు గుంటూరు, కడప జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన..

YS Jagan: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఈ రోజు గుంటూరు, కడప జిల్లాలో పర్యటించనున్నారు.. ముందుగా గుంటూరు జిల్లా తెనాలిలోని సహన కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అనంతరం బద్వేల్ లో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన ఇంటర్ బాలిక కుటుంబాన్ని పరామర్శించనున్నారు. గుంటూరు నుంచి హెలికాప్టర్‌లో ఆయన బద్వేల్ కు చేరుకుంటారు. బద్వేల్ లోని రామాంజనేయ నగర్ లో ఉన్న బాలిక కుటుంబ సభ్యులను ఆయన కలవనున్నారు. వారిని పరామర్శించి, ఓదార్చనున్నారు. అనంతరం అక్కడి నుంచి పులివెందులకు చేరుకుంటారు. రాత్రి పులివెందులలో బస చేస్తారు.

ఈ రోజు ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుండి హెలికాప్టర్‌లో బయల్దేరనున్న వైఎస్‌ జగన్‌.. ఉదయం 10:30 గంటలకు గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ కు చేరుకుంటారు.. ఆ తర్వాత గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో మృతి చెందిన.. తెనాలి యువతి సహనా కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.. అనంతరం హెలికాప్టర్‌లో వైఎస్ఆర్ జిల్లాకు బయల్దేరి వెళ్లనున్న ఆయన.. నేరుడు బద్వేల్ చేరుకుంటారు.. అక్కడ ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన ఇంటర్‌ విద్యార్థిని కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.. కాగా, ఏపీలో ఈ వరుస ఘటనలు కలకలం సృష్టించాయి.. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ ఆ కుటుంబ సభ్యులను పరామర్శించనున్న నేపథ్యంలో ప్రాధాన్యత ఏర్పడింది.. ఈ సందర్భంగా ప్రభుత్వంపై మరోసారి వైఎస్‌ జగన్‌ విరుచుకుపడే అవకాశం ఉంది.