Leading News Portal in Telugu

AP Government: పెండింగ్‌ దరఖాస్తులపై సర్కార్‌ స్పెషల్ ఫోకస్..


AP Government: భవన నిర్మాణాలు, లే అవుట్లు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీ, ఏపీ రేరా అనుమతులపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది.. అన్ని రకాల ఫీజులు చెల్లించి, సరైన డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ ఆన్‌లైన్‌లో పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల తక్షణ పరిష్కారానికి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నిర్ణయం తీసుకున్నారు.. త్వరితగతిన దరఖాస్తులు పరిష్కరించేలా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు పట్టణ ప్రణాళికా విభాగానికి ఆదేశాలు జారీ చేశారు.. మంత్రి నారాయణ ఆదేశాలతో దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసింది టౌన్ ప్లానింగ్ విభాగం.. 9398733100, 9398733101 నంబర్లకు వాట్సాప్ ద్వారా లేదా apdpmshelpdesk@gmail.com ఈ-మెయిల్ కు కూడా వివరాలు పంపవచ్చని వెల్లడించింది.. అన్ని పనిదినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకూ పనిచేయనుంది ఈ ప్రత్యేక విభాగం.. నిబంధనల ప్రకారం అన్నిరకాల డాక్యుమెంట్లు ఉండి ఫీజు చెల్లించినట్లు అయితే వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..

Read Also: Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌