- ఈ రోజు వాయుగుండం తుఫాన్ గా బలపడే అవకాశం..
-
ఏపీ సహా ఒడిశా- పశ్చిమ బెంగాల్- తమిళనాడు రాష్ట్రాలకు హైఅలర్ట్..

Cyclone Dana: వాయుగుండం ఈరోజు తుఫానుగా బలపడే అవకాశం ఉంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో గంటకు 6 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడుతుంది వాయుగుండం. దీంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీనికి ‘దానా’ తుఫానుగా నామాకరణం చేసినట్లు ఐఎండీ తెలిపింది.
ఇక, ఒడిశా, పశ్చిమ బెంగాల్ దగ్గర ఈ వాయుగుండం తీరం దాటే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరం వెంబడి గంటకు 45- 65 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీని ఎఫెక్ట్ తో విజయనగరం, మన్యం జిల్లా, శ్రీకాకుళం జిల్లాలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటు రుతుపవనాల ప్రభావంతో రాయలసీమలో మరో నాలుగు రోజులు భారీగా వర్షాలు పడనున్నాయని ఐఎండీ సూచించింది.
ఇక, మరోవైపు పశ్చిమ బెంగాల్ లోని 7 జిల్లాలకు వాతావరణ శాఖ హై అలర్ట్ జారీ చేసింది. పుర్బా, తూర్పు మిడ్నాపూర్, పశ్చిమ్ మెదినీపూర్, ఉత్తర, దక్షిణ 24 పరగణాల జిల్లాలకు హెచ్చరికలు జారీ చేయడంతో బెంగాల్ సర్కార్ అలర్ట్ అయింది. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన 24×7 పరిస్థితిని అంచనా వేయాలని సీఎం మమతా బెనర్జీ తెలిపింది. అలాగే, తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లడం మానుకోవాలని భారత వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఇప్పటికే వర్ష సూచనలు ఉన్న జిల్లాల్లోని స్కూల్స్, కాలేజీలకు సెలవులు ఇచ్చారు.