Leading News Portal in Telugu

Srisailam Temple: శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం.. బంగారు రథంపై ఆది దంపతులు..


  • శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం..

  • ఆరుద్ర నక్షత్రం సందర్భంగా స్వర్ణ రథోత్సవం..

  • బంగారు రథంపై దర్శనమిచ్చిన ఆది దంపతులు..
Srisailam Temple: శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం.. బంగారు రథంపై ఆది దంపతులు..

Srisailam Temple: ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో స్వర్ణ రథోత్సవం వైభవంగా సాగింది.. శ్రీశైలం దేవస్థానం వైదిక కమిటీ సూచన మేరకు ఆరుద్ర నక్షత్రం సందర్భంగా బంగారు స్వర్ణరథోత్సవం దేవస్థానం ఇంఛార్జి ఈవో చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.. శ్రీస్వామి అమ్మవార్ల స్వర్ణరథోత్సవంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు.. అనంతరం స్వర్ణ రథోత్సవం ఆలయ రాజగోపురం నుండి ఆలయం మాడవీధులు హరిహరరాయ గోపురం, బ్రహ్మానందరాయ గోపురం, శివాజీ గోపురం మీదుగా మాడవీధులలో భక్తుల కోలాహలం నడుమ కోలాటాలు మేళతాళాలతో వైభవంగా జరిగింది.. బంగారు స్వర్ణరథోత్సవం ఆలయ మాడవీధులలో జరుగుతుండడంతో వందలాదిగా భక్తులు, స్థానికులు తరలివచ్చి స్వర్ణ రథోత్సవం తిలకించారు.. స్వర్ణరథంపై ఆసీనులైన శ్రీస్వామి అమ్మవార్లు.. స్వర్ణ రథంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.. ముందుగా వేకువజామునే శ్రీమల్లికార్జునస్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు నిర్వహించి అనంతరం మాడవీధులలో స్వర్ణరథోత్సవం నిర్వహించారు.. స్వర్ణ రథోత్సవంలో భారీగా భక్తులు, స్థానికులు పాల్గొన్నారు..