Leading News Portal in Telugu

Govt orders further simplifying free sand policy..


  • ఉచిత ఇసుక విధానాన్ని మరింత సరళం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

  • సీనరేజీ విధానం పూర్తిగా రద్దు చేస్తూ ఉత్తర్వులు

  • డీఎంఎఫ్.. సీనరేజి ఛార్జీలు పూర్తిగా రద్దు

  • ఇసుక రీచ్ ల వద్ద సీసీ టీవీలు ఏర్పాటు.
AP Govt: ఉచిత ఇసుక విధానాన్ని మరింత సరళం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు..

ఉచిత ఇసుక విధానాన్ని మరింత సరళం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఉచిత ఇసుక పాలసీ 2024లో సీనరేజి ఫీజు మాఫీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు మైన్స్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా జీవో జారీ చేశారు. ఉచిత ఇసుక పాలసీపై ఈ నెల 21న జరిగిన సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయలను అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎటువంటి రుసుము చెల్లించకుండ ఇసుకను నిర్మాణ అవసరాలకు తీసుకు వెళ్ళేలా ఆదేశాలు ఇచ్చారు. నిర్మాణ రంగం వలన ఉపాధి ఆదాయం పెరుగుతున్నందున ఉచిత ఇసుక పూర్తిస్థాయిలో అమలుకు చర్యలు తీసుకుంది ప్రభుత్వం. ఇందులో భాగంగా సీనరేజీ ఫీజు, మెరిట్ అన్ శాండ్, డీఎంఎఫ్ మాఫీకి చర్యలు చేపట్టినట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు.

దీనివల్ల స్థానికంగా ఇసుక లభ్యత రవాణా పెరుగుతుంది అని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇసుక బ్లాక్ మార్కెటింగ్‌ను నివారించేలా విజిలెన్స్‌నూ పటిష్టం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇసుక లభ్యతను పెంచేలా ప్రస్తుత ఇసుక పాలసీలో మార్పులు చేర్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఉచిత ఇసుక పై ఉన్న పన్నులు, స్వయంగా ఇసుక తవ్వకం, తరలింపు, ఇసుక లభ్యం కానీ జిల్లాలో స్టాక్ యార్డుల ఏర్పాటు.. విజిలెన్స్ మానిటరింగ్ పై విధివిధానాలు మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇసుక అక్రమంగా తరలిపోకుండా జీపీఎస్.. చెక్ పోస్టుల వద్ద పటిష్ట తనిఖీలకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.