Leading News Portal in Telugu

Jani Master Released from Chanchalguda Jail


  • చంచల్ గూడ జైలు నుండి జానీ మాస్టర్ బెయిల్ పై విడుదల
  • హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం తో చంచల్ గూడ జైలు నుంచి విడుదల
  • 36 రోజులుగా చంచల్ గూడ జైల్లో ఉంటున్న జానీ మాస్టర్
Jani Master: 36 రోజుల జైలు.. ఎట్టకేలకు బయటకొచ్చిన జానీ మాస్టర్

ఫోక్సో సహా రేప్ కేసుల్లో అరెస్టై ప్రస్తుతం చెంచల్గూడా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న జానీ మాస్టర్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈరోజు మధ్యాహ్నం చంచల్గూడా జైలు నుంచి జానీ మాస్టర్ బెయిల్ పై విడుదలయ్యారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు అధికారులు నిబంధనల మేరకు ఆయనను బయలు పై విడుదల చేశారు.

War 2 Leaked Pic: యాక్షన్ మోడ్ లో ఎన్టీఆర్.. చూశారా?

తన దగ్గర పని చేసిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఒకరు రేప్ కేసు పెట్టడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. గోవాలో ఉన్న జానీ మాస్టర్ను అరెస్టు చేసి హైదరాబాద్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఆ తర్వాత ఆయనకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఆ రిమాండ్ నెమ్మదిగా పొడిగిస్తూ 36 రోజుల పాటు ఆయన జైలులోనే ఉన్నారు. ఇక ఈ జైలు శిక్ష కారణంగా జానీ మాస్టర్ పుష్ప 2 సినిమాలో ఒక సాంగ్ కొరియోగ్రఫీ చేసే అవకాశాన్ని కోల్పోయారు. ఈ విషయాన్ని నిన్న పుష్ప ప్రెస్మీట్లో నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.