Leading News Portal in Telugu

Hotels Receive Bomb Threat Emails In Tirupati


  • టెంపుల్‌ సిటీ తిరుపతిలో వరుసగా బాంబు బెదిరింపులు..

  • అలిపిరి పీఎస్ పరిధిలోని హోటళ్లకు బెదిరింపు ఈమెయిల్స్..

  • అప్రమత్తమైన పోలీసులు.. డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు..
Bomb Threat: తిరుపతిలో మళ్లీ కలకలం.. ప్రముఖ హోటళ్లకు బాంబు బెదిరింపులు..

Bomb Threat: టెంపుల్‌ సిటీ తిరుపతిలో వరుసగా బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి.. నగరంలోని అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజ్ పార్క్, పాయ్ వైస్రాయ్ హోటల్ సహా మరో రెండు ప్రాంతాలకు తాజాగా బాంబు బెదిరింపులు వచ్చాయి.. దీంతో.. అప్రమత్తమైన పోలీసులు.. డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు.. ఇక, రెండు రోజులు క్రితం నాలుగు హోటల్స్ కు ఇదే తరహాలో బాంబు బెదిరింపులకు సంబంధించిన ఈ-మెయిల్‌ వచ్చిన విషయం విదితమే కాగా.. ఇప్పుడు మరోసారి బాంబు బెదిరింపులతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది..

అయితే, ఐఎస్ఐ పేరుతో తాజాగా బెదిరింపులు వచ్చిన రాజ్ పార్క్, పాయ్ వైస్రాయ్ హోటళ్లలో రష్యన్, మలేషియాకు చెందిన మహిళలు 25 మంది వరకు బస చేశారు.. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తిరుపతికి వచ్చారు విదేశీయులు‌.. తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో బాంబు బెదిరింపులతో ఈ మెయిల్ పంపించారు దుండగులు.. ఐఎస్ఐ ఉగ్రవాదులు పేరుతో వచ్చిన ఆ ఈ మెయిల్‌పై వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు.. దీంతో.. అప్రమత్తమైన పోలీసులు డాగ్‌ స్క్వాడ్‌తో రంగంలోకి దిగిన సోదాలు నిర్వహిస్తున్నారు.. అయితే, టెంపుల్‌ సిటీని టార్గెట్‌గా చేసుకుని.. వరుసగా ఇలాంటి మెయిల్స్‌ వస్తున్న నేపథ్యంలో.. భక్తులు కలవరం మొదలైంది..