Leading News Portal in Telugu

Woman Died Due to Food Poison after Eating Momos, More Than 20 People Fell ill in Hyderabad


  • హైదరాబాద్‌లోని నందినగర్‌లో విషాదం
  • మోమోస్ తిని ఫుడ్ పాయిజన్
  • ఓ మహిళ మృతి
  • 20 మందికి పైగా అస్వస్థత
Food Poison: మోమోస్ తిని ఫుడ్ పాయిజన్.. ఒకరు మృతి, 20 మందికి పైగా అస్వస్థత

Food Poison: హైదరాబాద్‌లోని నందినగర్‌లో విషాదం చోటుచేసుకుంది. నంది నగర్‌లో మోమోస్ తిని ఓ మహిళ మృతి చెందగా.. మరో 20 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తు్న్నారు. నందినగర్‌లో వారాంతపు సంతలో పెట్టిన మోమోస్‌ను బాధితులు తిన్నట్లు తెలిసింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 20 మందికి పైగా అస్వస్థతకు గురి కాగా.. బాధితులు ఇంకా పెరుతున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మృతురాలు సింగాడికుంటకు చెందిన మహిళగా గుర్తించారు. ఈ ఘటనపై బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారాంతపు సంతలో మోమోస్ పెట్టారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఒక్కొక్కరిగా బాధితులు బయటికి వస్తున్నారు. బంజారాహిల్స్ పరిధిలో జరిగే వీక్లీ మార్కెట్లలో మోమోస్ విక్రయాలు జరిగాయి. సింగాడికుంట, నందినగర్, వెంకటేశ్వర కాలనీలతో పాటు పలు ప్రాంతాల్లో మోమోస్ బాధితులు ఉన్నట్లు తెలిసింది. మోమోస్ తిని గత వారం తీవ్ర అస్వస్థతతో హాస్పిటల్‌కు చేరిన రేష్మ అనే మహిళా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. మోమోస్ షాప్ నిర్వహిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.